Magazines

అశ్వారావుపేటలో యువతి అదృశ్యం..

20 నిమిషాల క్రితం

woman missing
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 24, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - అశ్వారావుపేట

అశ్వారావుపేట పట్టణంలోని కోనేరు బజారుకు చెందిన ఊడ దుర్గాప్రసాద్ కుమార్తె భాను హాసిని (19) అదృశ్యమైనట్లు ఎస్‌హెచ్‌ఓ సాయి కిశోర్ రెడ్డి తెలిపారు. ఈ నెల 21 వ తేదీ సోమవారం మధ్యాహ్నం కన్యకా పరమేశ్వరి ఆలయంలో నిర్వహించే అన్నదాన కార్యక్రమానికి వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీంతో ఆందోళనకు గురైన తండ్రి పోలీసులను ఆశ్రయించారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్‌హెచ్‌ఓ సాయి కిశోర్ రెడ్డి వెల్లడించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్