Magazines

సీనియర్ జర్నలిస్ట్ పెండ్యాల రామ్ కుమార్ కు టిడబ్ల్యూజెఏప్ నివాళి

1 గంట క్రితం

TWJAP pays tribute to senior journalist Pendyala Ram Kumar
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 02, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మల్హర్ రావు

మంథని ప్రెస్ క్లబ్ సీనియర్ సభ్యుడు,సీనియర్ జర్నలిస్ట్ పెండ్యాల రామ్ కుమార్ (47) అనారోగ్యంతో హైదరాబాదులోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందారు.విషయం తెలుసుకున్న (టిడబ్ల్యూజెఏప్) తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ పెడరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చింతల కుమార్ యాదవ్ సోమవారం మంథని పట్టణంలోని వారి స్వగృహంలో మృతుని పార్టీవదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళర్పించారు.


ఈ సందర్భంగా మాట్లాడారు.. రామ్ కుమార్ విద్యార్థి దశ నుంచే అనేక సామాజిక ఉద్యమాల్లో కీలకంగా పనిచేశారని,సుదీర్ఘ కాలం పాటు మంథని కేంద్రంగా జర్నలిస్టుగా వివిధ దినపత్రికల్లో పనిచేస్తూ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం చొరవ చూపారు.పేద ప్రజల గొంతుకగా,అధికారులకు,ప్రజా ప్రతినిధులకు ప్రజా సమస్యలను తెలియజేయడంలో ఆయన ముందుండేవారని కొనియాడారు. సామాజిక స్పృహ, నిజాయితీ, నిర్భయ జర్నలిజం ఆయన ప్రత్యేకత.మంథనిలో జరిగిన అనేక ఉద్యమాల్లో, ప్రజా సమస్యల పోరాటాల్లో ఆయన క్రియాశీల పాత్ర పోషించారని తెలిపారు. ఆయన అకాల మరణంపై సంతాపం వ్యక్తం చేస్తూ,ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని,కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్