Magazines

కుటుంబ కలహాల నేపథ్యంలో మహిళ మృతి

11 గంటల క్రితం

Woman dies amid family dispute
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 07, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ – తాడ్వాయి: కుటుంబ కలహాల నేపథ్యంలో బ్రహ్మణపల్లి గ్రామానికి చెందిన కొత్త లావణ్య (42) మృతి చెందిన ఘటన తాడ్వాయి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. సంతానం లేకపోవడంతో రాజమల్లయ్య దంపతులు సుమారు 12 ఏళ్ల క్రితం తమ బంధువుల కుమారుడు రాజును దత్తత తీసుకున్నారు. అతడి భార్య లావణ్యతో కలిసి తమ వద్దే ఉంచుకున్నారు. అయితే రాజు గత రెండేళ్లుగా ఉపాధి నిమిత్తం దుబాయ్‌లో ఉంటున్నాడు. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య తరచూ కుటుంబ విషయాలపై గొడవలు జరుగుతుండేవని, కుటుంబ సభ్యులు వారికి నచ్చజెప్పేవారని తెలిసింది. ఈ నెల 5న రాత్రి కూడా దంపతుల మధ్య గొడవ జరిగినట్లు సమాచారం. మరుసటి రోజు కుటుంబ సభ్యులు ఓ నిశ్చితార్థ వేడుకకు వెళ్లగా, ఇంట్లో లావణ్య మృతి చెందినట్లు పొరుగువారు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కుటుంబ కలహాలు, మానసిక ఆవేదన కారణంగా ఈ ఘటన జరిగి ఉండవచ్చని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తాడ్వాయి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్