ప్రతిపాదిత సుంకాలను ఖండించిన సీపీఐ(ఎం)
న్యూఢిల్లీ : భారత్‌పై 25శాతం సుంకం విధించాలన్న అమెరికా ప్రతిపాదనను భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) (సీపీఐ(ఎం) తీవ్రంగా ఖండించింది. ‘వ్యవస్థాగతంగా మితిమీరిన సామర్ధ్యం’, ‘బలవంతంగా కార్మికుల వినియోగం’ వంటి కల్పిత కారణాలతో ఈ సుంకాన్ని ప్రతిపాదించారని విమర్శించింది. ఈ మేరకు గురువారం పొలిట్‌బ్యూరో ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రతిపాదిత సుంకాన్ని 17 శాతానికి తగ్గించేందుకు ఇరుదేశాల వాణిజ్య ఒప్పందంతో ముడిపెట్టడాన్ని భారత్‌ను బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం తప్ప మరొకటి కాదని పేర్కొంది. ప్రస్తుతం ఈ వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్న నేపథ్యంలో అమెరికా ఏకపక్షంగా ఒత్తిడి చేస్తుందని తెలిపింది. ఈ ఎత్తుగడలను ధృఢంగా వ్యతిరేకించడానికి బదులుగా మోడీ ప్రభుత్వం స్పందించిన తీరు అసమర్థంగా వుందని పొలిట్‌బ్యూరో పేర్కొంది. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం తక్షణం స్పందించాలని, అమెరికా ఎత్తుగడలను వ్యతిరేకించాలని కోరింది. భారత ప్రజల ప్రయోజనాలను పరిరక్షించేలా ప్రస్తుతం జరిగే వాణిజ్య చర్చల్లో ధృఢమైన వైఖరి తీసుకోవాలని సీపీఐ(ఎం) డిమాండ్ చేసింది.
అమెరికావి బ్లాక్ మెయిల్ చర్యలు
1 గంట క్రితం

balaji
ప్రచురించబడింది నవం 27, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్లు (0)