250 మంది మహిళా రైతుల భాగస్వామ్యం
నవతెలంగాణ : న్యూఢిల్లీ
దేశ వ్యవసాయ రంగంలో మహిళా రైతుల పాత్రను గుర్తిస్తూ న్యూఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (IARI)లో గురువారం మహిళా కిసాన్ దివస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మూడు జిల్లాలకు చెందిన సుమారు 250 మంది మహిళా రైతులు పాల్గొన్నారు.
మహిళా రైతుల కృషిని గుర్తించడం, వ్యవసాయ రంగంలో వారి భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం ఈ వేడుకల ప్రధాన ఉద్దేశం. వ్యవసాయ రంగంలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లు, వారి సాధికారత, వ్యవసాయ అభివృద్ధిలో మహిళల పాత్ర వంటి అంశాలకు ఈ సందర్భంగా ప్రాధాన్యం కల్పించారు.

IARI డైరెక్టర్ శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళా రైతుల భాగస్వామ్యం విశేషంగా నిలిచింది. వ్యవసాయ రంగంలో మహిళల నైపుణ్యాన్ని, వారి కృషిని గుర్తించి ప్రోత్సహించడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయవచ్చనే అభిప్రాయం ఈ వేడుకల ద్వారా ప్రతిబింబించింది..






కామెంట్లు (0)