భారత్‌లో తీవ్రరూపం దాల్చుతున్న ఆర్థిక, సామాజిక అంతరాలు
పేదల ఆదాయాలు పడిపోతుంటే సంపన్నుల సంపదకు రెక్కలు
ధనికులపై సంపద, వారసత్వ పన్నులు విధించాలి: ఆర్థికవేత్త జయతి ఘోష్
డిసెంబర్ 1న పార్లమెంట్ ముట్టడికి లక్ష మంది కార్మికులు
న్యూఢిల్లీ: దేశంలో ఆర్థిక అసమానతలు ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్నాయని ప్రముఖ ఆర్థికవేత్త జయతి ఘోష్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు నాణ్యమైన ఉపాధి కల్పించడం లో, కనీస అవసరాలు తీర్చడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమవుతోందని విమర్శించారు. సంపన్నుల సంపద పెరుగుతుండగా, సామాన్య కార్మికుల నిజ వేతనాలు తగ్గి పోతున్నాయన్నారు. ఈ పరిస్థితిని అరికట్టేందుకు అత్యంత ధన వంతులపై సంపద, వారసత్వ పన్నులు విధించా లని డిమాండ్ చేశారు. సీఐటీయూ డిసెంబర్ 1న లక్షమంది కార్మికులతో పార్లమెంట్ ముట్టడి కార్యక్రమానికి పిలుపు నిచ్చింది. ఈ నేపథ్యంలో బుధవారం ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమా వేశంలో జయతి ఘోష్ మాట్లాడుతూ.. దేశం అసమానతల అత్యవసర పరిస్థితిని ఎదుర్కొంటోం దన్నారు. వలస పాలనాకాలం కంటే ప్రస్తుతం అసమానతలు అధ్వానంగా ఉన్నాయని పలు అధ్య యనాలు వెల్లడిస్తున్నాయని చెప్పారు. కొలంబియా, బ్రెజిల్ దేశాల తరహాలో సంపన్నులపై సంపద, వారసత్వ పన్నులు విధించాలని సూచించారు.
కార్పొరేట్ సంస్థలకు పన్ను రాయితీలు ఇచ్చినా ఉద్యోగాల కల్పన జరగడం లేదని సీఐటీయూ అధ్యక్షుడు సుదీప్ దత్తా విమర్శించారు. ఈ విధానం విఫలమైందని ప్రధాని మోడీ ఇటీవల చేసిన వ్యాఖ్యలే తమ వాదనకు నిదర్శనమన్నారు. నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తు న్నాయి. కనీస వేతనాన్ని రూ.42 వేలకు, సార్వత్రిక పింఛన్‌ను రూ.21 వేలకు పెంచాలని కోరుతున్నాయి. కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరించడం, సమాన పనికి సమాన వేతనం, ప్రభుత్వ రంగంలో ఖాళీల భర్తీ, కార్మికుల భద్రతకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. మోడీ ప్రభుత్వ విధానాలు దేశంలోని సామాన్యుల జీవన ప్రమాణాలను మెరుగు పరచడం కంటే కొద్దిమంది సంపన్నుల లాభాలకే ఉపయోగపడుతున్నాయని పలువురు మేధావులు, విద్యావేత్తలు విమర్శించారు. కార్మికుల ఆందోళన లకు ప్రధాన మీడియా తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల హక్కులు, జీవన భద్రతకు హామీ లేకుండా దేశ ఆర్థిక వ్యవస్థ ముందుకు సాగలేదని స్పష్టం చేశారు.







కామెంట్లు (0)