Magazines

యువత అంటే ఎందుకంత భయం?

28 నిమిషాల క్రితం

afraid
avatar
balaji

ప్రచురించబడింది నవం 24, 2026 | 2 నిమిషాల చదవడం

లండన్‌ వెళ్ళకుండా నన్ను అడ్డుకున్నారు : సీజేపీ నేత సౌరవ్‌‌దాస్‌‌ వెల్లడి

ఆక్స్‌‌ఫర్డ్‌ వర్సి టీ నుంచి చర్చకు అందిన ఆహ్వానం


న్యూఢిల్లీ : కాక్రోచ్‌‌ ఉద్యమంపై ప్రసంగించేందుకు ఆక్స్‌‌ఫర్డ్‌ ‌యూనివర్శిటీ తనకు ఆహ్వానం పంపిందని, కానీ అక్కడకు వెళ్ళనివ్వకుండా తనను అడ్డుకున్నారని కాక్రోచ్‌‌ జనతా పార్టీ (సీజేపీ) కో కన్వీనర్‌ ‌సౌరవ్‌ ‌దాస్‌ ‌సోమవారం తెలిపారు. లండన్‌‌లో జరిగే ఒక కార్యక్రమానికి వెళ్ళడానికి తాను బయలుదేరానని, తెల్లవారు జామున ఒంటిగంటకు తాను విమానం ఎక్కాల్సి వుండగా ఢిల్లీ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్‌ ‌కౌంటర్‌‌ వద్ద తనను నిలిపివేశారని దాస్‌ ‌పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌‌లో పోస్టు పెట్టారు. ‘ఈ పిరికిపంద మోడీ ప్రభుత్వం నన్ను లండన్‌ ‌వెళ్ళనివ్వకుండా అడ్డుకుంది’ అని ఆయన పేర్కొన్నారు. ‘‘ఆక్స్‌‌ఫర్డ్‌, కేంబ్రిడ్జి, ఎల్‌ఎస్‌ఈ, ఎడిన్‌‌బరో వంటి ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీ లు కాక్రోచ్‌ ఉద్యమంపై ప్రసంగాలు చేసేందుకు తనను ఆహ్వానించాయని కానీ ఈ పిరికి ప్రభుత్వం లండన్‌‌కు వెళ్ళే విమానాన్ని ఎక్కకుండా తనను అడ్డుకుందని పేర్కొన్నారు. అక్కడి భారతీయ విద్యార్ధులు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు, కానీ నేను అక్కడకు వెళ్ళడానికి ఈ మేథో వ్యతిరేక ప్రభుత్వం భయపడుతోందని అన్నారు.


ప్యానెల్‌ ‌చర్చలో పాల్గొనాల్సిందిగా ఆక్స్‌‌ఫర్డ్‌ ‌యూనివర్సి టీ విద్యార్ధుల యూనియన్‌ నుంచి ఆహ్వానం అందింది. చదువుకున్న యువత మేథోపరమైన చర్చలో పాల్గొంటుందంటే ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. ‘‘నేను నీరవ్‌‌ మోడీనో, విజయ్‌ ‌మాల్యానో అయి వుంటే బాగుండేది. బ్యాంకుల నుంచి కోట్లాది రూపాయిలు దోచుకుని వుంటే బాగుండేది.’’ అని దాస్‌ వ్యాఖ్యానించారు. అయితే ఈ సంఘటన తన పనిని కొనసాగించనివ్వకుండా తనను అపలేదని అన్నారు. భవిష్యత్తులోనైనా తాను లండన్‌, పారిస్‌లకు వెళతానన్నారు.కాగా ఈ సంఘటనపై స్పందిస్తూ, ఆక్స్‌‌ఫర్డ్‌‌ వర్శిటీ నుండి దాస్‌ ఆహ్వానం అందుకున్నారంటే అధికారంలో వున్నవారికి అసూయద్వేషాలు కలిగాయని, అందుకే ఇదంతా జరుగుతోందని సిజెపి వ్యవస్థాపకుడు అభిజిత్‌ ‌దీప్కే విమర్శించారు.

సౌరవ్‌‌దాస్‌ ‌పాస్‌‌పోర్ట్‌‌లో తేడాలు : నోటీసులు జారీ

సీజేపీ కో కన్వీనర్‌ ‌సౌరవ్‌‌దాస్‌ ‌పాస్‌‌పోర్ట్‌‌లో ఆయన పుట్టిన ప్రదేశానికి సంబంధించి వ్యత్యాసాలు వున్నాయని ఇమ్మిగ్రేషన్‌ ‌అధికారులు తెలిపారు. అందువల్లే ఆయనను సోమవారం అర్ధరాత్రి లండన్‌ ‌వెళ్ళనివ్వకుండా ఆపామని తెలిపారు. అనంతరం చెన్నై ప్రాంతీయ పాస్‌‌పోర్ట్‌ ‌కార్యాలయం (ఆర్‌‌పీఓ) ఆయనకు మంగళవారం నోటీసులు జారీ చేసింది. ఏడు రోజుల్లోగా స్పందించాల్సిందిగా కోరింది. దీనిపై వివరణ ఇచ్చేవరకు ఏ ప్రయాణానికీ ఈ పాస్‌‌పోర్ట్‌‌ను ఉపయోగించరాదని కూడా సూచించింది. పాస్‌‌పోర్ట్‌‌ను జప్తు చేసే చర్యలు చేపట్టింది. 2019 ఆగస్టు 21న దాస్‌‌కు చెన్నై ప్రాంతీయ పాస్‌పోర్ట్‌ ‌కార్యాలయం ‌పాస్‌‌పోర్ట్‌‌ను జారీ చేసింది. గత రెండు మాసాల్లో విమానాశ్రయంలో దాస్‌‌ను ఆపడం ఇది రెండవసారి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్