Magazines

చెట్ల పాదులు

52 నిమిషాల క్రితం

Tree basins
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 01, 2026 | 1 నిమిషాల చదవడం

వానాకాలం రాంగనే ఎండబెట్టిన అనక్కాయ నుంచి గింజలు తీసి, మా ఇంటి మూలన చిన్న గుంట తీసి నాటేది! గింజలు మట్టిలో పెట్టినంక లోపల ఏదో తెలియని ఉత్సాహం సైంటిస్టులెక్క ఏదో అద్భుతం జరగబోతున్నట్టు మనసంతా ఆశతో ఉబ్బిపోయేది! బడి నుండి వచ్చినంక మొలకకి నీళ్లు పోయడం, అది ఎప్పుడు పెద్దగా అయితదా అని రోజూ పొద్దున్నే చూడడం కంది పొరకతో దాని చుట్టూ పాదు వేసి, కోళ్లు పొక్కిలి చేయకుండా చిన్న పిల్లని కాపాడినట్టు కంటికి రెప్పలా కాపాడేది! ఆ పాదు మెల్లమెల్లగా పెరుగుతూ మా ఇంటి రేకులతో సోపతి చేస్తూ, ఇల్లంతా అల్లుకుంటూ చ ిన్న పిందెలు వేసేది ఆ పిందెలన్నీ రేకుల మీద జారుకుంటూ, చిన్న పిల్లలెక్క హాయిగా నిద్రపోయేవి! కొన్ని రోజులయినంక పెద్ద పెద్ద ఆకుల మధ్య దాసుకొని కనపడకుండా ఉండే సొరకాయలతో దొంగపోలీస్ ఆట ఆడేది! ఊర్లో వచ్చే భీమ్లా తాత కాడ తమాటీలు, పచ్చిమిరపకాయలు పూసలోళ్ల అమ్మమ్మ కాడ వట్టి చాపలు తప్ప కూరగాయలు కొన్న రోజులు నాకైతే గుర్తులేవు! సొరకాయ పాదు, కాకరకాయ పాదు, దొండ పాదులు కోడి జుట్టు కూర, బచ్చల కూరలే మా పొట్టకు అవసరమైనప్పుడు ఆకలి తీర్చిన అమ్మలయ్యాయి! ఇయ్యాల జెప్టోలో సొరకాయ ఆర్డర్ పెట్టినప్పుడు అనిపించింది అవి కేవలం పాదులు కావు మా ఇంటి మీద పెరిగిన పచ్చని గురుతులు నా పల్లె బతుకు ఆనవాళ్లు అని!


గనగాని రాజు, 9666555086

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్