Magazines

‌రామప్ప దేవాలయానికి చరిత్ర లేకుండా చేస్తారా?

1 గంట క్రితం

Are they going to strip the Ramappa Temple of its history?
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 07, 2026 | 2 నిమిషాల చదవడం

‌బొగ్గు తవ్వకాల ప్రతిపాదనను విరమించుకోవాలి : మాజీ ఎంపీ వినోద్‌‌కుమార్‌ డిమాండ్‌

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
కాకతీయులు 800 ఏండ్ల కింద నిర్మించిన రామప్ప దేవాలయానికి చరిత్ర లేకుండా చేస్తారా?అని బీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీ బి వినోద్ కుమార్ ‌రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మంగళవారం హైదరాబాద్‌‌లోని తెలంగాణ భవన్‌‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రామప్ప దేవాలయం దగ్గర సింగరేణి కాలరీస్ ఓపెన్ కాస్ట్ మైనింగ్ చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని చెప్పారు. ఆ గనికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పేరు పెట్టారని అన్నారు. బంగారం దొరికినా రామప్ప దేవాలయానికి నష్టం కలిగించడానికి వీల్లేదని అన్నారు. మధ్యప్రదేశ్‌లో ప్రఖ్యాత ఖజురహో దేవాలయం దగ్గర వజ్రాలు దొరుకుతా‌యనీ, ఆ దేవాలయానికి ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా అక్కడ వజ్రాలు వెలికి తీయడం లేదని గుర్తు చేశారు. రామప్ప దేవాలయం దగ్గర బొగ్గు వెలికి తీసేందుకు ఆర్కియాలజీ సంస్థ అనుమతి తప్పనిసరని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు. సింగరేణి ఆ అనుమతిని పక్కన బెట్టి ఏవో సంస్థలు చెప్పాయనే కారణంతో రామప్ప దగ్గర ఓపెన్ కాస్ట్ మైనింగ్‌కు సిద్ధమవుతోందని అన్నారు. వెంకటాపురం దగ్గర ఓపెన్ కాస్ట్ మైనింగ్ ఆలోచనను విరమించుకుని రామప్ప దేవాలయాన్ని రక్షించాలని డిమాండ్‌ ‌చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి, బీఆర్ఎస్ నేత లక్ష్మణ్ రావు, లీగల్ సెల్ ప్రతినిధి సి కళ్యాణ్ రావు తదితరులు పాల్గొన్నారు. ​ప్రశ్నిస్తే వేధింపులా : సుమిత్రానంద్‌ సీఎం రేవంత్‌‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల దోపిడీని, అవినీతిని ప్రశ్నిస్తే నిర్బంధించడం, వేధింపులకు గురిచేయడం సరైంది కాదని టీజీపీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్రానంద్ అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్‌‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ దళితనేత క్రిశాంక్‌ను పోలీసులు అకారణంగా అరెస్టు చేశా‌రని చెప్పారు. క్రిశాంక్ రిమాండ్‌ను ‌కోర్టు తిరస్కరించడం రాష్ట్ర ప్రభుత్వానికి చెంప పెట్టు అని అన్నారు. క్రిశాంక్‌ ‌లేవనెత్తిన ప్రశ్నలకు సీఎం రేవంత్‌‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. కేటీఆర్‌ను హెచ్చరించే స్థాయి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌‌కు లేదన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మహిళా నేతలు మమత, అన్నపూర్ణమ్మ, షకీలా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్