Magazines

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి బెయిల్

53 నిమిషాల క్రితం

Bail granted to trainee IPS officer Uday Krishna Reddy.
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 07, 2026 | 1 నిమిషాల చదవడం

షరతులతో ఉప్పరపల్లి కోర్టు మంజూరు
హైదరాబాద్ : లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.25 వేల చొప్పున 2 పూచీకత్తులు సమర్పించాలని, ప్రతి ఆదివారం పోలీసుల ఎదుట విచారణకు హాజరుకావాలని న్యాయమూర్తి బెయిల్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 67 రోజుల తర్వాత ఉప్పరపల్లి కోర్టు మంగళవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

అసలేం జరిగిందంటే?
హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో మహిళా ట్రైనీ ఐపీఎస్పై లైంగిక వేధింపులు, బ్లాక్మెయిలింగ్కు పాల్పడ్డారనే ఆరోపణలపై ఉదయ్ కృష్ణారెడ్డిపై జులై 18న అత్తాపూర్ పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. తనకు ఉదయ్ కృష్ణారెడ్డి అసభ్యకరమైన మెసేజ్లు పంపించాడని, తన సెల్ఫోన్ లాక్కొని పాస్వర్డ్ చెప్పాలని బెదిరించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఉదయ్పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరోవైపు తనపై వచ్చిన ఫిర్యాదులు, ఆరోపణలు అవాస్తవమంటూ ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఇన్స్టా వేదికగా పోస్టు చేశారు. చట్టంపై, న్యాయస్థానాలపై తనకు పూర్తిగా నమ్మకం ఉందని, న్యాయం గెలుస్తుందని అతడు పేర్కొన్నారు. అనంతరం మోతీనగర్లో ఉన్న బంధువుల నివాసానికి వచ్చిన ఉదయ్ కృష్ణారెడ్డి మద్యం సేవించి అపస్మారక స్థితికి వెళ్లాడు. కానీ అంతకు ముందు ఆత్మహత్యాయత్నం చేసి, ఆస్పత్రి పాలైనట్లుగా ప్రచారం జరిగింది. ఆస్పత్రిలో చికిత్స అనంతరం ఉదయ్, గత నెల 22వ తేదీన ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జి అయ్యారు. కీలక పరిణామాల అనంతరం ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌ మహిళా భద్రత విభాగం డీసీపీ లావణ్య నేతృత్వంలో విచారణ జరిపారు. ఈ కేసులో అత్తాపూర్‌ పోలీసులు ఇప్పటికే వివిధ మార్గాల్లో కొన్ని ఆధారాలు, ఫోన్‌ ఛాటింగ్‌ వివరాలు సేకరించారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్