నేడు స్వగ్రామం సిద్దిపేటలో అంత్యక్రియలు
పలువురు పాత్రికేయులు, ఉద్యోగుల సంతాపం
నవతెలంగాణ-సిటీబ్యూరో
‘నవతెలంగాణ’ దినపత్రిక హైదరాబాద్ రీజియన్ స్టాఫ్ రిపోర్టర్ ఈవై. రత్నాకర్ తల్లి ఈవై. సరళాదేవి(72) బుధవారం మధ్యాహ్నం మృతిచెందారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో స్వగ్రామమైన సిద్దిపేటలో తుదిశ్వాస విడిచారు. ఆమె మృతదేహానికి గురువారం సిద్దిపేటలో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. సరళాదేవి మృతి పట్ల ‘నవతెలంగాణ’ పత్రిక యాజమాన్యం, సంపాదక వర్గం, జర్నలిస్టులు, సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రత్నాకర్‌తో పాటు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, సరళాదేవి ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం ప్రకటించారు. పలు జర్నలిస్టు సంఘాల నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.






కామెంట్‌లు (0)