Magazines

సినిమా థియేటర్‌ 
కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

56 నిమిషాల క్రితం

థియేటర్స్‌ ఎంప్లాయీస్‌ ‌యూనియన్‌(‌సీఐటీయూ)
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 07, 2026 | 2 నిమిషాల చదవడం

‌కార్మిక శాఖ కమిషనర్‌‌కు వినతి : తెలంగాణ సినిమా థియేటర్స్‌ ఎంప్లాయీస్‌ ‌యూనియన్‌(‌సీఐటీయూ)

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
సినిమా థియేటర్స్ లో పనిచేసే కార్మికుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ సినిమా థియేటర్స్‌ ఎంప్లాయీస్‌ ‌యూనియన్‌(‌సీఐటీయూ) డిమాండ్‌ ‌చేసింది. మంగళవారం హైదరాబాద్‌‌లోని కార్మిక శాఖ కమిషనర్‌‌కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె వెంకటేశ్‌,సినిమా థియేటర్స్‌ ఎంప్లాయీస్‌ ‌యూనియన్‌ ‌రాష్ట్ర అధ్యక్షులు మారన్న ‌మాట్లాడుతూ కోట్ల రూపాయలతో నిర్మించిన సినిమాలను ప్రేక్షకుల కు చూపిస్తున్న సినిమా థియేటర్ కార్మికులు చాలీచాలని వేతనాలతో బతుకుతున్నారని తెలిపారు. మల్టీప్లెక్స్ సినిమా థియేటర్ల లో కార్పొరేట్ సంస్థలు వచ్చిన తర్వాత ఒకే చోట 8 నుండి 10 స్క్రీన్లు ఏర్పాటు చేసి 50 మంది చేయాల్సిన పనిని 15-20 మంది తోనే చేయిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మల్టీప్లెక్స్ థియేటర్ల లో ఉదయం 9 గంటలకు వస్తే రాత్రి 2 దాటేవరకు కూడా పని చేయిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రోజుకు 12 నుంచి 14 గంటల పని చేసి రాత్రి సమయాల్లో పని నుండి ఇంటికి వెళ్లేందుకు రవాణా సౌకర్యం కల్పించడం లేదని తెలిపారు. ప్రొజెక్టర్ ఆపరేటర్ గా లైసెన్స్ ఉన్న వారు మాత్రమే సినిమాలు నడిపించాలని నిబంధనలు ఉన్నప్పటికీ దీనికి భిన్నంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. కొన్ని మల్టీప్లెక్స్ సినిమా థియేటర్లలో పనిచేస్తున్న మహిళలకు రక్షణ లేదని చెప్పారు. పీవీఆర్‌ ఐనాక్స్ మల్టీప్లెక్స్ మహిళా కార్మికులు వాష్ రూమ్ కి వెళ్లాలంటే కూడా ముగ్గురు నలుగురు పర్మిషన్ తీసుకొని పోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. షర్ట్‌ ఎమౌంట్‌ వచ్చిందనే పేరుతో కార్మికుల జీతాలలో కోతలు విధిస్తున్నారని తెలిపారు. ఈ సమస్యలపై కార్మిక శాఖ స్పందించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నగర ప్రధాన కార్యదర్శి జె కుమార్‌, ట్రాన్స్‌‌పోర్టు యూనియన్‌ ‌రాష్ట్ర నాయకులు కె అజయ్‌‌బాబు, యూనియన్‌ ‌రాష్ట్ర కార్యదర్శి కె అరుణ్‌, రాష్ట్ర ఉపాధ్యక్షులు పి పుల్లారావు,రాష్ట్ర నాయకులు శ్రీనివాసరెడ్డి, కమలాకర్‌‌గౌడ్‌,మురళి, యాదగిరి, చలం, రాజు, నాగేందర్‌, భరత్‌, ప్రదీప్‌, సుధాకర్‌, వీరనారాయణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్