Magazines

‌త్వరలో కేసీఆర్‌ వద్దకు తీసుకెళ్తా

1 గంట క్రితం

I will take you to KCR soon.
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 24, 2026 | 1 నిమిషాల చదవడం

సామ్రాజ్యానికి కేటీఆర్‌ హామీ

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌

త్వరలో ‌బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ వద్దకు తీసుకెళ్లి చిరకాల కోరికను నెరవేర్చుతానని ఆ పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ మాటిచ్చారు. శుక్రవారం హైదరాబాద్‌‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ‌కె తారక రామారావును ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మల్లవరంకు చెందిన 96 ఏండ్ల బామ్మ దుగ్గిదేవర సామ్రాజ్యం కలిశారు. ఆమెను కేటీఆర్ ఆప్యాయంగా పలకరించి శాలువాతో సత్కరించి గౌరవించారు, ఆమె మల్లవరం గ్రామ సర్పంచ్‌గా ‌రెండు సార్లు, ఎంపీటీసీగా రెండుసార్లు, సింగిల్ విండో డైరెక్టర్‌గా పని చే‌శారు. కేసీఆర్‌ అంటే సామ్రాజ్యానికి ఎనలేని అభిమానం. ఆయన్ను కలిసి ఫొటో దిగాలనేది ఆమె చిరకాల కోరిక. ఈ విషయాన్ని ఆమె పెద్ద కుమారుడు, బీఆర్ఎస్ నాయకుడు వెంకటలాల్ ఎంపీ రవిచంద్ర దృష్టికి తీసుకెళ్లారు. ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా సామ్రాజ్యాన్ని ఆమె కుమారులు వెంకటలాల్, అజయ్ కుమార్, మనవళ్లు యుధిష్టర్, శ్రీరఘునందన్‌లను వెంటబెట్టుకుని రవిచంద్ర కేటీఆర్‌‌ను కలిశారు.

శ్రీరఘునందన్‌‌కు కేటీఆర్ అభినందన

సామ్రాజ్యం మనవడు, అజయ్ కుమార్ కుమారుడు శ్రీరఘునందన్ బెంగళూరులో బీబీఏ చదువుతున్నారు. ఆయనకు చిన్నతనం నుంచే సమాజ సేవ, పరిశుభ్రత, పచ్చదనం పట్ల మక్కువ ఎక్కువ. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా 2016 ఫిబ్రవరి 17న మల్లవరంలోని ప్రాథమిక పాఠశాలను ఆయన దత్తత తీసుకున్నారు. శ్రీరఘునందన్ చేస్తున్న సమాజసేవను అభినందిస్తూ 2017లో జాతీయ, 2017, 18లలో రాష్ట్రస్థాయి స్వచ్ఛ పాఠశాల పురస్కారాలు లభించాయి. ఈ సందర్భంగా శ్రీరఘునందన్, ఆయన కుటుంబ సభ్యులను కేటీఆర్, రవిచంద్రలు అభినందించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్