Magazines

ఉద్యోగులు బాధ్యతతో పని చేయాలి

1 గంట క్రితం

work responsibly
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 15, 2026 | 1 నిమిషాల చదవడం

పంచాయతీ రాజ్‌ ‌శాఖ మంత్రి సీతక్క

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఉద్యోగులు బాధ్యతతో పని చేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని పంచాయతీ రాజ్‌ ‌శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌‌లో జిల్లా సీఈవోలు, డిప్యూటీ సీఈవోల అసోసియేషన్ సభ్యులు మంత్రిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధికారులు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ, మెరుగైన పనితీరుతో ప్రజలకు చేరువ కావాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడే వాతావరణ పరిస్థితులు, వాటి వల్ల తలెత్తే సవాళ్లను ఎదుర్కొనేందుకు అధికారులు ముందస్తు ప్రణాళికతో పనిచేయాలన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా అవసరమైన చర్యలు చేపడుతూ, క్షేత్రస్థాయిలో సమన్వయంతో వ్యవహరించాలని ఆదేశించారు. సమర్థవంతమైన పనితీరు, అంకితభావం, సమన్వయంతోనే ప్రభుత్వ లక్ష్యాలను సాధించగలమని పేర్కొన్నారు. ఈ భేటీలో టీజీవో అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావుతో పాటు అసోసియేషన్ అధ్యక్షులు ప్రేమ్ కరణ్ రెడ్డి, జనరల్ సెక్రటరీ శ్రీనివాస్, అసోసియేట్ ప్రెసిడెంట్ నర్సింహాలు, ట్రెజరర్ నవీన్, ఉపాధ్యక్షులు ప్రవీణ్, సబిత, ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్