Magazines

నయా యాక్ష‍న్‌ ఎంటర్‌టైనర్‌

1 గంట క్రితం

entertainer
avatar
balaji

ప్రచురించబడింది నవం 01, 2026 | 1 నిమిషాల చదవడం

మలయాళ బ్లాక్‌బస్టర్ ‘ఆవేశం’ ఫేమ్ దర్శకుడు జిత్తు మాధవన్‌తో కలసి హీరో సూర్య యాక్షన్-కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘సీన్’ చేస్తున్నారు. జ్యోతిక, సూర్య జాగరం స్టూడియోస్, 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జయశ్రీ దామోదరన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు. డీఎస్పీ ప్రేమ్‌రాజ్ పాత్రలో సూర్య ఎంట్రీ అదిరిపోయింది. ‘కెరీర్ పరంగా ఇప్పుడు పీక్‌లో ఉన్నప్పుడు ఉద్యోగానికి రిజైన్ చేసి ఏం చేస్తావు?’ అని ప్రశ్నించగా, ‘పాలిటిక్స్‌లోకి వెళ్లిపోతా’ అని సూర్య బదులివ్వడం ఆసక్తి రేకెత్తించింది. అలాగే, పని మనిషి పాత్రలో నజ్రియా నజీమ్ పాత్రను తీర్చిదిద్దిన విధానం కూడా వెరైటీగా ఉంది. యాక్షన్, కామెడీ, థ్రిల్ అంశాలతో ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచింది. ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ & తెలంగాణలో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఎన్వీఆర్ సినిమా ద్వారా గ్రాండ్ రిలీజ్ కానుంది. దీపావళి కానుకగా ఈనెల 6న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్