యువన్ కృష్ణ ఎంటర్టైన్మెంట్స్, మనస్విని భాగ్యరాజ సమర్పణలో కార్తీక్ భాగ్యరాజ రచన, దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘డియర్ ఆస్ట్రోనాట్’. సౌమిత్, శ్రేయసి సేన్, కమల్ కామరాజు, గీతా భాస్కర్, చైత్ర ముఖ్య పాత్రలను పోషించారు. ఈ మూవీని నవంబర్ 20న విడుదల చేయనున్నారు.
ఈ నేపథ్యంలో గురువారం ఈ సినిమా నుంచి ఓ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా విచ్చేసిన డైరెక్టర్ శేఖర్ కమ్ముల మాట్లాడుతూ, ‘ఆస్ట్రోనాట్ అవ్వాలనే కోరిక ఉండటం, ఆ కోరిక చుట్టూ కథను తీయడం బాగుంది. ఈ అమ్మాయి కూడా చక్కగా నటించింది. ఇది చాలా మంచి ప్రయోగం. ఎవరైనా సరే ఎంత పెద్ద కలలైనా కనొచ్చు, వాటిని సాకారం చేసుకోవచ్చు అనే గొప్ప సందేశాన్ని ఇచ్చేలా సినిమాని రూపొందించారు.
టెక్నికల్‌గా ఈ చిత్రం ఎంతో క్వాలిటీగా ఉందనిపిస్తోంది. ఇదొక గొప్ప సినిమాగా నిలుస్తుంది’ అని అన్నారు.
ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ మాట్లాడుతూ, ‘‘శేఖర్ కమ్ముల, ఇంద్రగంటి స్టైల్లో ఈ సినిమా ఉంటుంది. నాకు నచ్చి ఈ చిత్రం చేశాను’ అని చెప్పారు. మ్యూజిక్ డైరెక్టర్ కార్తిక్ మాట్లాడుతూ, ‘సినిమాని ఇప్పటికే చూశాను. కార్తీక్ నాకు మంచి స్నేహితుడు. ఈ సినిమా కోసం తను ప్రాణం పెట్టాడు. ఈ మూవీ అందరికీ కనెక్ట్ అవుతుంది’ అని తెలిపారు.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మేఘన మాట్లాడుతూ, ‘ఈ సినిమాకి ఎడిటర్ మార్తాండ్ అని చెప్పడంతో అంతా షాక్ అయ్యేవారు. ఆయన వల్లే ఈ మూవీకి ఇంత మంచి పేరు వచ్చింది’ అని తెలిపారు. కమల్ కామరాజ్ మాట్లాడుతూ, ‘ఇలాంటి చిత్రాన్ని తెర మీదకు తీసుకు రావడమే గొప్ప సాహసం. కలలు కంటే సాకారం అవు తాయా? లేదా? అన్నది మనకు తెలీదు. కానీ పెద్ద కలలు కనాలి, వాటిని సాకారం చేసుకోవాలని చెప్పే గొప్ప సందేశంతో ఈ మూవీని తీశారు. అందరికీ స్పూర్తినిచ్చే చిత్రమిది’ అని చెప్పారు.
కలల సాకారానికి ప్రతీకగా..
1 గంట క్రితం

balaji
ప్రచురించబడింది అక్టో 29, 2026 | 2 నిమిషాల చదవడం






కామెంట్లు (0)