కొలంబియా : దక్షిణ కరోలినాలోని ఐకెన్ కౌంటీలో ఉన్న అణు కేంద్రంలో బుధవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అమెరికా ఇంధన శాఖకు చెందిన ఈ అణు కేంద్రంలోని సవన్నా రివర్ లేబొరేటరీ గదిలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో కొద్దిసేపు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. సమీపంలోని విమాన, రైలు రవాణా సర్వీసులను నిలిపివేశారు. రేడియేషన్ లీక్ కాలేదని, రాత్రికి పరిస్థితి అదుపులోకి వచ్చిందని తెలిపిన అధికారులు ఎమర్జెన్సీ హెచ్చరికలను ఎత్తివేశారు. రేడియో అణుధార్మికత ల్యాబ్ ప్రాంగణానికే పరిమితమని, బయట ఉన్న ప్రజలకు ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదని తెలిపారు. అయితే ముందుజాగ్రత్త చర్యగా లేబరేటరీ ప్రవేశ ద్వారాలను మూసివేశారు.







కామెంట్‌లు (0)