Magazines

ఖేలో ఇండియా యూత్‌ ‌గేమ్స్‌ ముఖ్య అతిథిగా ప్రధాని మోడీ!

1 గంట క్రితం

Khelo India
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 29, 2026 | 1 నిమిషాల చదవడం

కేంద్ర మంత్రి మాండవీయను కోరిన వాకిటి శ్రీహరి

నవతెలంగాణ-న్యూఢిల్లీ : ఖేలో ఇండియా యూత్‌ ‌గేమ్స్‌ ఆరంభ వేడుకలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా రావాలని, ఆ మేరకు చొరవ తీసుకోవాలని కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్‌ ‌మాండవీయను తెలంగాణ క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి కోరారు. డిసెంబర్‌ 11 ‌నుంచి 22 వరకు రాష్ర్టవ్యాప్తంగా ఆరు వేదికల్లో ఖేలో ఇండియా యూత్‌ ‌గేమ్స్‌ ‌నిర్వహణ ప్రణాళిక, సన్నద్ధతను వివరించేందుకు రాష్ర్ట ప్రభుత్వ క్రీడా బృందం గురువారం న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి మాండవీయతో సమావేశమైంది. ఖేలో ఇండియా యూత్‌ ‌గేమ్స్‌‌లో పోటీపడే క్రీడాకారులకు కల్పించే వసతులు, సదుపాయాలు, రవాణా, భద్రత, వైద్య సదుపాయం, సాంకేతిక ఏర్పాట్లు, సంబంధిత విభాగాల మధ్య సమన్వయం వంటి అంశాలపై క్రీడా ప్రాధికార సంస్థ పవర్‌‌పాయింట్‌ ‌ప్రజెంటేషన్‌ ఇచ్చింది. క్రీడాకారులు, కోచ్‌‌లు, సహాయక సిబ్బంది, అధికారులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా లోపరహిత ప్రణాళికలు సిద్ధం చేశామని, కేంద్రం సూచనలతో మరింత పకడ్బందిగా నిర్వహిస్తామని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. కార్యక్రమంలో రాష్ర్ట ప్రభుత్వ సలహాదారు ఏపీ జితేందర్‌‌రెడ్డి, స్పెషల్‌ ‌చీఫ్‌ ‌సెక్రటరీ వాణి ప్రసాద్‌, శాట్స్‌ ఎండీ సోనీబాలా దేవి, స్పోర్ట్స్‌ అథారిటీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్