హీరో దుల్కర్ సల్మాన్ లేటెస్ట్ బ్లాక్బస్టర్ ‘ఆకాశంలో ఒక తార’. పవన్ సాధినేని దర్శకత్వంలో గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్బాక్స్ మీడియా బ్యానర్లపై సందీప్ గున్నం, రమ్య గున్నం నిర్మించారు. సాత్విక వీరవల్లి కథానాయికగా నటించగా, శ్రుతి హాసన్, రుహాని శర్మ కీలక పాత్రల్లో కనిపించారు. ఈనెల 20న వరల్డ్ వైడ్గా రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించారు. నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ,‘ప్రేక్షకుల హృదయాలను కదిలించడం ఒక కమర్షియల్ లెక్క. ఈ సినిమాతో అదే చేశాం. సినిమా చూసిన ప్రేక్షకులందరూ చాలా ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నారు. అదే రకంగా కలెక్షన్స్ కూడా వస్తున్నాయి.
సోమవారం కూడా అన్ని సినిమాల కంటే ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. రెండో వారం కూడా మొదటి వారం కంటే ఎక్కువగా ఉంటుందా అన్నంత ఉధృతంగా సినిమా రన్ అవుతోంది. ఈ సినిమాకి చాలా అవార్డులు కూడా వస్తాయనే నమ్మకం ఉంది. అశ్వినీ దత్తో కలిసి ఏడు సినిమాలు చేశాను. ఇప్పుడు వాళ్ళ అమ్మాయి స్వప్నతో చాలా బలమైన కథతో సినిమా చేయడం మాకు సంతోషాన్నిచ్చింది. స్వప్నతో కనీసం ఏడు సినిమాల ప్రయాణం ఉంటుంది. గంగరాజు స్క్రీన్ప్లే రాయడం.. అనీ అద్భుతంగా కుదిరాయి. దర్శకుడు పవన్, నిర్మాత సందీప్ ఈ కథను నమ్మి మొదటి నుంచి చాలా నమ్మకంగా ప్రయాణం చేశారు. వారి నమ్మకం నిజమైంది. ఈ సినిమా తర్వాత దర్శకుడు పవన్ మాతోనే సినిమా చేస్తున్నారు. అలాగే సాత్వికతో రెండు సినిమాలు చేస్తున్నాను’ అని తెలిపారు.







కామెంట్లు (0)