Magazines

అమ్మవారి అపారమైన శక్తి, కరుణకు ప్రతిబింబం

54 నిమిషాల క్రితం

power and compassion
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 18, 2026 | 2 నిమిషాల చదవడం

నవరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బిర్లా స్టూడియోస్, టెంపుల్ టౌన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న భక్తిరస చిత్రం ‘కనకదుర్గ’. ఈ చిత్రంలో అల్లరి నరేశ్, కాజల్ చౌదరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహిస్తుండగా, బీవీఎస్ రవి కథను అందించారు. ఈ సినిమా నుంచి తొలి పాట ‘అమ్మ కనకదుర్గ’ను విజయవాడలో ఏర్పాటు చేసిన ఓ ప్రత్యేక కార్య్రకమంలో విడుదల చేశారు. సంగీత ద‌ర్శ‌కుడు తమన్ స్వరపరిచిన ఈ పాటను జీ మ్యూజిక్ కంపెనీ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ఈ పాటకు సిరాశ్రీ సాహిత్యం అందించారు. కనకదుర్గమ్మ దివ్య అనుగ్రహం, శక్తి, ఆధ్యాత్మిక విశిష్టతను చాటిచెప్పేలా ఈ పాటను రూపొందించారు. ఈ సంద‌ర్భంగా హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ, ‘నేను ఇప్పటివరకు ఎన్నో డిఫరెంట్ జోనర్స్ మూవీస్ చేశాను. అయితే తొలిసారి ఇలాంటి భక్తిరస చిత్రంలో నటిస్తున్నాను. ఈ నవరాత్రుల్లో ఎక్కడ చూసినా మార్మోగిపోయేలా ఒక పాటను కంపోజ్ చేయాలని తమన్ని కోరాను. ఆయ‌న అద్భుత‌మైన పాట‌ను అందించారు.

సినిమా షూటింగ్ పూర్తయింది. సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది’ అని అన్నారు. ‘తమన్ త‌న‌దైన శైలిలో ఈ పాటకు ప్రాణం పోశారు. సినిమాలో కీలకమైన భక్తి భావాన్ని, ఆధ్యాత్మికతను తన సంగీతంతో అద్భుతంగా ఆవిష్కరించారు’ అని బిర్లా స్టూడియోస్ సహ నిర్మాత సునీల్ చైనాని చెప్పారు. టెంపుల్ టౌన్ పిక్చర్స్ నిర్మాతలు అజిత్ ఠాకూర్, బీవీఎస్ రవి మాట్లాడుతూ, ‘ఈ పాట భక్తుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకోవడంతో పాటు, వారి ప్రార్థనలు, పండుగ వేడుకల్లో భాగం కావాలని కోరుకుంటున్నాం’ అని తెలిపారు. ‘సంగీతానికి భాష, సంస్కృతి, తరాలకు అతీతంగా ప్రజలను అనుసంధానించే శక్తి ఉందని జీ మ్యూజిక్ కంపెనీ విశ్వసిస్తుంది. ఈ పాట కనకదుర్గమ్మవారి ఆధ్యాత్మిక విశిష్టతను, భక్తి సంగీతానికి ఉన్న శక్తిని చాటిచెబుతుంది’ అని జీ మ్యూజిక్ కంపెనీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ సుజల్ పరేఖ్ చెప్పారు. సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ, ‘ఈ పాటకు సంగీతం అందించడం నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. ఈ పాట కేవలం ఓ సంగీత రచనలా కాకుండా.. భక్తుడు అమ్మవారిని ప్రార్థించే సమయంలో కలిగే గాఢమైన భావోద్వేగాన్ని, అమ్మవారి అపారమైన శక్తిని, కరుణను ప్రతిబింబించేలా ఉండాలని కోరుకున్నాను’ అని అన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్