Magazines

డ్యాన్స్​తో ఒత్తిడి తగ్గుతుంది

1 గంట క్రితం

Dancing reduces stress.
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 18, 2026 | 2 నిమిషాల చదవడం

ఈ రోజుల్లో ఎక్కువ మంది​ ఎదుర్కొంటోన్న మానసిక సమస్యల్లో ఒత్తిడి ఒకటి. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ సమస్యతో చిత్తవుతున్నారు. మానసిక ఒత్తిళ్లు, ఆందోళనల్ని దూరం చేసుకోవడానికి డ్యాన్స్ కూడా ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్నారు నిపుణులు.


ఏ రకం డ్యాన్స్​ చేయాలన్నా మ్యూజిక్​ కంపల్సరీ. ఎందుకంటే సంగీతాన్ని బట్టే మూమెంట్స్​ మారుతుంటాయి. అయితే ఈ మ్యూజిక్‌ శరీరంలో కార్టిసాల్‌ (ఒత్తిడి హార్మోన్లు) స్థాయుల్ని తగ్గిస్తుందని, ఫలితంగా ఆందోళన తగ్గుతుందని చెబుతున్నారు నిపుణులు.

జిమ్​కు వెళ్తే రోజూ ఒకటే రకమైన వ్యాయామాలు చేయాలి. ఇలా చేయాలంటే ఎవరికైనా బోర్​ కొడుతుంది. అదే డ్యాన్స్‌లో ఈ సమస్య ఉండదు. ఎందుకంటే పాటకు తగినట్లుగా విభిన్న భంగిమలు ప్రయత్నించవచ్చు ఇది పరోక్షంగా ఒత్తిడినీ దూరం చేస్తుంది.

డ్యాన్స్‌ క్లాసుల్లో చేరడం వల్ల మన చుట్టూ ఉన్న వారితో అనుబంధాన్ని పెంచుకోవచ్చు. క్రమక్రమంగా ఇది ఒత్తిడిని దూరం చేసుకునేందుకు ఓ మార్గం అవుతుంది.

కొంతమంది తమకు ఎదురయ్యే సమస్యలను ఎదుటివారితో చెప్పుకోవడానికి వెనకాడుతుంటారు. ఫలితంగా ఒత్తిడి, ఆందోళనలను గురై మానసికంగా మరింత ఇబ్బంది పడుతుంటారు. అదే భావోద్వేగాల్ని డ్యాన్స్‌ రూపంలో వ్యక్తపరిస్తే మనసు కాస్త కుదుటపడుతుంది.

మానసిక సమస్యల కారణంగా శారీరక కండరాలపై ఒత్తిడి పడుతుందని.. అదే డ్యాన్స్‌ వల్ల ఈ కండరాలు కాస్త రిలాక్సవుతాయి. అలాగే శరీరంలో శక్తి స్థాయులూ పెరుగుతాయి. పరోక్షంగా ఇది మానసిక ప్రశాంతతను అందిస్తుంది.

డ్యాన్స్​ శరీరంలో సెరటోనిన్‌ స్థాయుల్ని పెంచుతుందని, ఫలితంగా ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత సొంతమవుతుందనే విషయాన్ని పలు పరిశోధనలూ రుజువు చేశాయి.

డ్యాన్స్​ వల్ల మానసిక ప్రశాంతత మాత్రమే కాకుండా.. శారీరకంగా కూడా ధృడంగా మారుతుంది. అయితే ఇన్ని ప్రయోజనాలు లభించాలంటే ఎక్కువసేపు డ్యాన్స్​ చేయాలని చాలా మంది భావిస్తుంటారు. కానీ అంత అవసరం లేదంటున్నారు నిపుణులు. అరగంట పాటు నృత్యం చేస్తే సరిపోతుందంటున్నారు. ఇలా చేయడం ద్వారా సరదాగా ఎంజాయ్‌ చేయడంతో పాటు ఒత్తిడినీ దూరం చేసుకోవచ్చంటున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్