Magazines

వ‌ర్సిటీల్లో 429 అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టులకు సర్కారు గ్రీన్‌‌సిగ్నల్‌

1 గంట క్రితం

Professor posts
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 18, 2026 | 2 నిమిషాల చదవడం

ఆర్థిక శాఖ ఉత్తర్వులు

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ఏడు విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ క్యాడర్‌లోని బోధనా సిబ్బంది పోస్టుల భర్తీకి సంబంధించి రాష్ట్ర ప్ర‌భుత్వం అనుమ‌తించింది. అందులో 429 అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు అనుమ‌తిస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఆదివారం ఉత్త‌ర్వులు జారీ చేశారు. అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టుల్లో అత్య‌ధికంగా 252 పోస్టులు ఉస్మానియా యూనివ‌ర్సిటీలో ఉండ‌గా, 49 పోస్టుల చొప్పున కాక‌తీయ‌, శాత‌వాహన యూనివ‌ర్సిటీల్లో ఉన్నాయి. అత్య‌ల్ఫంగా తెలంగాణ యూనివ‌ర్సిటీలో కేవ‌లం 2 అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టులను భ‌ర్తీ చేయ‌ను న్నారు. తెలంగాణ ఉన్నత విద్యా మండలి కార్యదర్శి వివిధ రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో 429 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్న‌ట్టు వివరాలను సమర్పించారు. ఈ వివరాలను సంబంధిత విశ్వవిద్యాలయాల రిజిస్ట్రార్లు ధృవీకరించారు. ఆయా విశ్వవిద్యా లయాల కార్యనిర్వాహక మండళ్లు (ఎగ్జిక్యూ టివ్ కౌన్సిల్స్) ఆమోదించాయని ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు. దీన్ని క్షుణ్ణంగా పరిశీలించిన ప్రభుత్వం, ఉన్నత విద్యా శాఖ పరిధిలోని రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 429 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను మొదటి దశలో డైర‌క్ట్ రిక్రూట్‌మెంట్‌ ద్వారా భర్తీ చేయడానికి అనుమతినిచ్చింది.

తెలంగాణ ఉన్నత విద్యా మండలి కార్యదర్శి, సంబంధిత విశ్వవిద్యాలయాల రిజిస్ట్రార్లు ఉత్తర్వులో అనుమతించిన పోస్టులను డైర‌క్ట్ రిక్రూట్‌మెంట్‌ ద్వారా భర్తీ చేయడానికి తక్షణమే అవసరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది. నియామ‌క ప్రక్రియకు సంబంధించిన అర్హతలు, రిజర్వేషన్ నిబంధనలు, రోస్టర్ పాయింట్లు, ఇతర చట్టబద్ధమైన నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని, జీవో 21, జీవో 31లో జారీ చేసిన‌ మార్గదర్శకాలకు అనుగుణంగా నియామక ప్రకటనలకు సంబంధించిన నోటిఫికేష‌న్ల‌ను జారీ చేయాల‌ని సూచించారు. మొత్తం 429 అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టుల్లో ఉస్మానియా యూనివ‌ర్సిటీలో252, కాక‌తీయ, శాత‌వాహ‌న వ‌ర్సిటీల్లో 49 చొప్పున, పాల‌మూరు యూనివ‌ర్సిటీలో 45, డాక్ట‌ర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివ‌ర్సిటీలో 16, సుర‌వ‌రం ప్ర‌తాప్ రెడ్డి తెలుగు యూనివ‌ర్సిటీ 16, తెలంగాణ యూనివ‌ర్సిటీలో 2 పోస్టులు క‌లిపి మొత్తం 429 అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్