Magazines

రైతు పోరాటాల చైతన్యదీప్తి ఏఐకేఎస్‌

1 గంట క్రితం

Spirit in Farmers' Struggles
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 18, 2026 | 2 నిమిషాల చదవడం

రైతు సంఘం నేతలు జూలకంటి, పోతినేని, సాగర్‌

ఏఐకేఎస్‌ 36వ అఖిల భారత మహాసభల లోగో ఆవిష్కరణ


నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
అఖిల భారత కిసాన్ సభ(ఏఐకేఎస్‌) 1.58 కోట్లకుపైగా రైతులతో ప్రపంచంలోనే అతిపెద్ద రైతాంగ ఉద్యమ సంస్థగా నిలిచిందనీ, తెలంగాణ, తెభాగా, వర్లీ ఆదివాసీ, పున్నప్ర వయలార్, సుర్మాలోయ రైతుల పోరాటాల చైతన్యదీప్తిని నేటికీ ముందుకు తీసుకెళ్తున్నదని ఏఐకేఎస్‌ అఖిల భారత మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షులు, ఆ సంఘం కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌‌రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్‌ ‌చెప్పారు. సామ్రాజ్యవాదం, భూస్వామ్యానికి వ్యతిరేకంగా సాగించిన ప్రతిఘటన వారసత్వ పోరాటాల స్ఫూర్తితో నయా ఉదారవాద ఆర్థిక విధానాలకు వ్యతిరేకం గా ఐక్య పోరాటాలను నిర్మిస్తూ అనునిత్యం రైతులకు ఏఐకేఎస్‌ అండగా నిలుస్తోందన్నారు. నవంబర్ 15 నుంచి 18 వరకు నల్లగొండలో జరిగే అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) 36వ అఖిల భారత మహాసభల లోగోను హైదరాబాద్‌‌లో వారు ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ..మహాసభ ప్రారంభం సందర్భంగా నవంబర్ 15న నల్లగొండలో లక్ష మంది రైతులతో భారీ ప్రదర్శన ఉంటుందనీ, అనంతరం బహిరం గసభ జరుగుతుందని చెప్పారు. మహాసభకు దేశ నలుమూలల నుంచి 850 మందికిపైగా ప్రతినిధులు, పరిశీలకులు, నాయకులు హాజరుకానున్నారని తెలిపారు. దేశానికి అన్నం పెట్టే రైతులు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే శ్రమజీవులు నేడు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని వాపోయారు.

ఒకవైపు కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా సాగుతున్న ఆర్థిక విధానాలు, మరోవైపు మతతత్వ రాజకీయాలు ప్రజల ఐక్యతను దెబ్బతీస్తున్నాయని చెప్పారు. 12 ఏండ్ల పాలనలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న హామీని మోడీ సర్కారు నెరవేర్చలేకపోయిందని విమర్శించారు. వ్యవసాయ సంక్షోభానికి శాశ్వత పరిష్కారం చూపలేదని ఎత్తిచూపారు. వ్యవసాయ సంక్షోభానికి కార్పొరేట్ అనుకూల విధానాలు, అసమాన మార్కెట్ వ్యవస్థ, బలహీనమైన సామాజిక భద్రత, ప్రకృతి వైపరీత్యాలు పరస్పరం కారణమవు తున్నాయని తెలిపారు. వీటిని ఎదుర్కొనేందుకు రైతులు, వ్యవసాయ కార్మికులు, కౌలురైతులు, గిరిజనులు, మహిళా రైతులు ఐక్యంగా ఉద్యమిం చాలని పిలుపునిచ్చారు. మతం, కులం పేరుతో ప్రజలను విభజించే శక్తులకు బదులుగా జీవనోపాధి, భూమి, ఉపాధి, ఆహార భద్రత వంటి మౌలిక సమస్యలపై ప్రజలు సంఘటితం కావాలని విజ్ఞప్తి చేశారు. రైతుకు గిట్టుబాటు ధర, వ్యవసాయ కార్మికుడికి కనీస వేతనం, గ్రామీణ పేదలకు ఉపాధి, భూమిలేనివారికి భద్రత కల్పించడం ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత అని నొక్కి చెప్పారు. అన్నదాతను కాపాడటం అంటే దేశాన్ని కాపాడట మేనన్నారు. శ్రమజీవుల హక్కులను పరిరక్షిం చకుండా సమానత్వంతో కూడిన అభివృద్ధి సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలం గాణ రైతు సంఘం రాష్ట్ర కోశాధికారి మూడ్ శోభన్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ అరిబండి ప్రసా దరావు, నంద్యాల నర్సింహారెడ్డి, పి.జంగారెడ్డి, ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, మాదినేని రమేష్, కందాల ప్రమీల, మల్లు నాగార్జునరెడ్డి, సహాయ కార్య దర్శులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, బొంతు రాంబాబు, మాటూరు బాలరాజుగౌడ్, లెల్లెల బాలకృష్ణ, ఉడుత రవీందర్ తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్