కారులో వెళ్తుండగా దుండగుల దాడి
ముంబయి: బాలీవుడ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ లక్ష్యంగా కాల్పులు జరిగాయి. ఆదివారం సాయంత్రం టైగర్ కారులో వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు ఈ దారుణానికి తెగబడ్డారు. బైక్పై వచ్చిన ముగ్గురు దుండగులు తుపాకీతో వరుసగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో టైగర్ ష్రాఫ్ కారు డ్రైవర్కు గాయాలు కాగా, తుపాకీ శబ్దం వినగానే నటుడు అప్రమత్తం కావడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ మేరకు జుహు పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ముంబయి ఆధారాలు సేకరిస్తున్నారు. నటుడు సల్మాన్ఖాన్తో సన్నిహితంగా ఉండటం వల్లే బిష్ణోయ్గ్యాంగ్ టైగర్పై కాల్పులు జరిపినట్టు సమాచారం. కాగా టైగర్ ష్రాఫ్ తండ్రి జాకీ ష్రాఫ్ కూడా బాలీవుడ్ నటుడే. తనయుడిపై కాల్పులు జరిగిన విషయం తెలియగానే ఆయన కుటుంబసభ్యులంతా షాక్ కు గురయ్యారు.






కామెంట్లు (0)