గుట్టువిప్పనున్న జపాన్ అంతరిక్ష పరిశోధన సంస్థ జాక్సా
టోక్యో.అంగారక గ్రహం (మార్స్). శతాబ్దాలుగా మానవాళిని ఆకర్షిస్తున్న ఎర్రటి అద్భుతం. అయితే దాని చుట్టూ తిరిగే రెండు చందమామల పుట్టుకపై మాత్రం ఇప్పటికీ సరైన ఆధారాలు లేవు. ఆ రహస్యాలను ఛేదించేందుకు జపాన్ అంతరిక్ష పరిశోధన సంస్థ జాక్సా సిద్ధమైంది. అంగారకుడి ఉపగ్రహాలైన ఫోర్బోస్, డిమోస్ల ఆవిర్భావం గురించి తెలుసుకునేందుకు ఓ రోవర్ను ల్యాండ్ చేసి మట్టి నమూనాలను భూమికి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచంలో మొట్టమొదటిసారి మార్స్ ఉపగ్రహాల నుంచి నమూనాలు తెచ్చేందుకు చేపడుతున్న ఈ సాహసోపేతమైన ఎమ్ఎమ్ఎక్స్ మిషన్ విశేషాలు త్వరలో వెలుగులోకి రానున్నాయని పరిశోధకులు తెలిపారు..






కామెంట్లు (0)