టి. గోపీచంద్ నటిస్తున్న నయా యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సింగ’. ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపు కుంటోంది. యాక్షన్ కొరియోగ్రాఫర్ వి. వెంకట్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. మలయాళ నటి అనార్కలి నాజర్ ఈ చిత్రంతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమవుతున్నారు. తాజాగా చిత్ర బృందం కీలకమైన షూటింగ్ షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. దీంతో సినిమా చిత్రీ కరణ 50 శాతం పూర్తయింది. అద్భుతమైన ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ స్పెషల్ సెట్స్‌ను నిర్మించి, కీలక సన్నివేశాల ను చిత్రీకరించారు. ఇప్పటివరకు జరిగిన షూటింగ్ పై మేకర్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. మేకర్స్ తాజాగా విడుదల చేసిన కొత్త పోస్టర్‌లో గోపీచంద్ పవర్‌ఫుల్ అవతార్‌లో కనిపిస్తున్నారు. డిసెంబర్ నుంచి కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.







కామెంట్‌లు (0)