Magazines

షూటింగ్‌ పూర్తి..

50 నిమిషాల క్రితం

Shooting complete
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 18, 2026 | 1 నిమిషాల చదవడం

హీరో సాయి దుర్గ తేజ్ నటిస్తున్న కొత్త సినిమా ‘సంబరాల ఏటి గట్టు’ (ఎస్‌వైజీ). ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. దర్శకుడు రోహిత్ కేపీ తెరకెక్కిస్తున్నారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుదీర్ఘమైన, కష్టతరమైన ప్రయాణం ముగిసిన సందర్భంగా మేకర్స్ ఓ బిహైండ్ ద సీన్స్ వీడియోను విడుదల చేశారు. సినిమా కోసం రూపొందించిన భారీ సెట్స్, రా అగ్రెషన్‌తో కూడిన యాక్షన్ సన్నివేశాలు, టీమ్ మధ్య ఉన్న ఎమోషనల్ బాండింగ్‌ను ఇందులో చూపించారు. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం 160 రోజులకు పైగా చిత్రీకరణ జరిపారు. 10కి పైగా భారీ షూటింగ్ షెడ్యూల్స్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. సాయి దుర్గ తేజ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమా ఆయనకి ఒక ప్రత్యేకమైన చిత్రంగా నిలవనుంది. వచ్చే ఏడాది జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు ఈ సినిమా సిద్ధమవుతోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్