హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందుతున్న చిత్రం ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మించారు. ఈనెల 30న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో కథానాయిక శ్రీనిధి శెట్టి మీడియాతో ఈ చిత్ర విశేషాలను షేర్ చేసుకున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయాలనే కోరిక నాకు ముందు నుంచి ఉంది. పైగా ఇది త్రివిక్రమ్, వెంకటేష్‌కి కూడా కొత్త జోనర్. త్రివిక్రమ్ ఫిల్మోగ్రఫీని గమనిస్తే, ఆయన సినిమాలకు పూర్తి భిన్నంగా ఈ సినిమా ఉంటుంది. అందుకే కథ వినగానే ఈ చిత్రంలో ఖచ్చితంగా భాగం కావాలి అనుకున్నాను.
ఇందులో నాది అమ్మ పాత్ర అయినప్పటికీ, సినిమాకి నో చెబుదామనే ఆలోచన ఒక్క క్షణం కూడా కలగలేదు. ఇలాంటి సినిమాలు, పాత్రలు అరుదుగా వస్తాయి.
ఇది క్రైమ్ కామెడీ మూవీ. డార్క్ కామెడీ ఉంటుంది. నేను మొదటిసారి కామెడీ పాత్ర చేశాను. నేను చిట్ ఫండ్ లో డబ్బులు పోగొడతాను. మొత్తం అప్పులు చేసేస్తాను. ఇప్పటిదాకా ఈ తరహా పాత్రలు చేయక పోవడంతో ఎలా చేస్తాననే సందేహం మొదట కాస్త కలిగినా.. అవుట్ పుట్ చూసుకున్న తర్వాత ఎంతో సంతృప్తి కలిగింది.
ఇటీవలే సినిమా చూశాను.. చాలా నచ్చింది. ఇందులో ఎక్కువగా కామెడీ ఉంటుంది. యాక్షన్ ఎంత మోతాదులో ఉందనేది మీకు సినిమా చూశాక తెలుస్తుంది. కామెడీని ఎంతగా ఎంజాయ్ చేస్తారో, యాక్షన్ కూడా అదే స్థాయిలో అలరిస్తుంది.







కామెంట్లు (0)