Magazines

అందర్నీ థ్రిల్‌ చేసే ‘వృషకర్మ’

34 నిమిషాల క్రితం

Vrushakarma
avatar
balaji

ప్రచురించబడింది నవం 07, 2026 | 1 నిమిషాల చదవడం

హీరో నాగచైతన్య నటిస్తున్న మైథలాజికల్ థ్రిల్లర్ ‘వృషకర్మ’. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 4న థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. కార్తీక్ దండు దర్శకత్వంలో ఎస్‌వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై రూపొందుతున్న ఈ చిత్రాన్ని బాపినీడు సమర్పిస్తున్నారు. విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ, ప్రతి సినిమాతో తెరపై కొత్తదనాన్ని చూపించే నాగ చైతన్య.. ‘స్వాగ్ ఆఫ్ అర్జున్’ ఫస్ట్ సింగిల్‌తో తన స్క్రీన్ ప్రెజెన్స్‌లో మరో కొత్త కోణాన్ని ఆవిష్కరించారు. స్టైల్, అటిట్యూడ్, ఎనర్జీ కలగలిసిన ఈ పాటలో అర్జున్ పాత్రను పరిచయం చేశారు. అసాధారణమైన సాహస యాత్రకు సిద్ధమవు తున్న ట్రెజర్ హంటర్‌గా అర్జున్‌ను ఈ పాటలో చూపించారు. బి. అజనీష్ లోక్‌నాథ్ ట్రెండీ బీట్స్‌తో అదిరిపోయే కంపోజిషన్ అందించడమే కాకుండా, తన ప్రత్యేకమైన వాయిస్ తో పాటను మరింత ఆకట్టుకునేలా పాడారు.

లిరిసిస్ట్ అభినవకవి తన సాహిత్యంతో కథానాయకుడి స్వాగ్, అటిట్యూడ్‌ను అద్భుతంగా ఆవిష్కరించారు. ఇక ‘ఐయామ్ బార్న్ టు రూల్’ అనే పవర్‌ఫుల్ క్యాచ్‌లైన్ అర్జున్ పాత్రకు మంచి ఎలివేషన్ ఇచ్చింది. తన సాహస యాత్రకు అర్జున్ ఎలా సిద్ధమవుతున్నాడో ఈ పాట ద్వారా ఆసక్తికరంగా చూపించారు. స్టైలిష్, కాన్ఫిడెంట్ అవతార్‌లో నాగ చైతన్య ఆకట్టుకున్నారు. ఆయన ఎలిగెంట్ బాడీ లాంగ్వేజ్, కమాండింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ పాత్రకు పర్ఫెక్ట్‌గా సరిపోయాయి. విజయ్ బిన్నీ కొరియోగ్రఫీ, చైతన్య ఈజీగా చేసిన డ్యాన్స్ మూవ్స్, స్టైలిష్ స్టెప్స్ ఈ పాటను విజువల్ ట్రీట్‌గా నిలిపాయి. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుండగా, స్పర్శ్ శ్రీవాస్తవ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్