Magazines

‌కార్మిక శాఖలో ‌బీమా కుంభకోణంపై విచారణ జరపాలి

1 గంట క్రితం

ఇ ప్రవీణ్‌‌కుమార్‌ లేఖ
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 28, 2026 | 1 నిమిషాల చదవడం

ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ సంస్థకు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌‌కుమార్‌ లేఖ

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌

కార్మిక శాఖలో బీమా చెల్లింపుల కుంభకోణంలో అక్రమ లావాదేవీలపై ఈడీ, ఏసీబీ, సీబీఐ విచారణ జరపాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్‌ ‌చేశారు. ఈ మేరకు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్‌ ‌డెవలప్‌‌మెంట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా సంస్థకు ఆయన మంగళవారం లేఖ రాశారు. ట్రయల్ బ్లెజర్ సంస్థ రిజిస్ట్రేషరన్‌‌ను తాత్కాలికంగా నిలిపేయాలని కోరారు. ఆ సంస్థకు ఎలాంటి కమీషన్ లేదా పారితోషికం చెల్లించకుండా ప్రభుత్వం, సంక్షేమ బోర్డును ఆదేశించాలని సూచించారు. గతేడాది జూన్ నుంచి చెల్లించిన ప్రతి క్లైయిమ్‌ను ఆడిట్ చేయాలని తెలిపారు. పెద్దపల్లి, మంచిర్యాల, కరీంనగర్, హన్మకొండ, వరంగల్, సూర్యాపేట జిల్లాల్లో చెల్లించిన క్లెయిమ్‌లను పరిశీలించాలని పేర్కొన్నారు. బోర్డు పాలసీలకు సంబంధించిన అన్ని రికార్డులనూ భద్రపరిచాలనీ, వాటిని అధికార సంస్థ ముందు సమర్పించాలని తెలిపారు. ట్రయల్ బ్లెజర్, క్రెడిట్ యాక్సెస్ లైఫ్ ఇన్సూరెన్స్, హెచ్‌‌డీఎఫ్‌‌సీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ సంస్థలను ఆదేశించాలని పేర్కొన్నారు. ప్రధాన మంత్రి జీవన జ్యోతి భీమా యోజన, ఇతర గ్రూప్ భీమా పథకాలతో పోల్చి ప్రీమియం ధరలపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని కోరారు. ఉల్లంఘనలు జరిగినట్టు నిరూపితమైతే ట్రయల్ బ్లెజర్ సంస్థ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలనీ, జరిమానా విధించాలని డిమాండ్‌ ‌చేశారు. ఫిర్యాదు అందిన 30 రోజుల్లోగా చర్యలు తీసుకోవాలని ఇన్సూరెన్స్‌ ‌రెగ్యులేటరీ సంస్థను కోరారు.




ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్