Magazines

ఐడీబీఐ బ్యాంక్‌‌ను ప్రయివేటీకరించొద్దు

58 నిమిషాల క్రితం

Do not privatize IDBI Bank
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 02, 2026 | 1 నిమిషాల చదవడం

కుటుంబ సభ్యులతో ఉద్యోగుల క్యాండిల్ ర్యాలీ

నవతెలంగాణ-మణికొండ

ఐడీబీఐ బ్యాంక్ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ బ్యాంకు ఉద్యోగులందరూ తమ కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు, చిన్నారులతో కలిసి ఐడీబీఐ బసరా-గచ్చిబౌలి క్వార్టర్స్‌లో శాంతియుతంగా కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ.. బ్యాంకును, ఉద్యోగుల హక్కులను, భవిష్యత్‌‌ను కాపాడుకోవాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. ఈ నెల 2, 3 తేదీల్లో రెండు రోజుల పాటు బ్యాంకు ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నారని చెప్పారు. తమ న్యాయమైన పోరాటానికి ప్రజలు నైతిక మద్దతు తెలియజేయాలని కోరారు. తమ డిజిటల్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా అందుబాటులో ఉంటాయని తెలిపారు. తమ పోరాటం కేవలం ఉద్యోగుల కోసం మాత్రమే కాదని, ఐడీబీఐ బ్యాంకు భవిష్యత్, దాని గుర్తింపును కాపాడుకోవడం కోసమేనని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు ఉద్యోగులు, వారి పిల్లలు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్