Magazines

‘కొండా’ యూ టర్న్

49 నిమిషాల క్రితం

Konda
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 30, 2026 | 1 నిమిషాల చదవడం

కేటీఆర్‌పై వ్యాఖ్యల ఉపసంహరణ.. బీఆర్‌ఎస్ వైపు అడుగులు

చర్చనీయాంశంగా ఎక్స్ పోస్టింగ్

తూర్పులో ఆసక్తికరంగా రాజకీయం


‌ నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
మాజీ మంత్రి కొండా సురేఖ బీఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్టు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయడం అటు రాష్ట్ర రాజకీయాల్లో, ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో సంచలనంగా మారింది. గురువారం ఉదయం కొండా సురేఖ ఈ మేరకు కేటీఆర్‌పై గతంలో చేసిన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేశారు. కేటీఆర్ పట్ల, ఆయన కుటుంబ సభ్యుల పట్ల ఎలాంటి దురుద్దేశం లేదని ప్రకటించారు. అప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఆ వ్యాఖ్యలు చేసినా చేయాల్సింది కాదన్నారు. మంత్రిగా ఉన్నప్పుడు సురేఖ, కేటీఆర్‌పై చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విషయం విదితమే. ఈ క్రమంలో కొండా సురేఖపై హై కోర్టులో కేసులు పెండింగ్‌‌లో ఉన్న విషయం విదితమే.


కొండా సురేఖను మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేశాక కాంగ్రెస్ పై, పార్టీ నాయకత్వంపై తీవ్ర ఆరోపణలు సైతం చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. కాగా, కొండా సురేఖ ప్రాతినిధ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఆమె తాజా వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఈ పరిణామంతో ‘కొండా’ దంపతులు బీఆర్‌ఎ‌స్‌‌లో చేరుతారనే ప్రచారం ఊపందుకుంది. బర్తరఫ్ అయిన సందర్భంలో కొండా దంపతులు బీఆర్‌ఎ‌స్‌‌లో చేరుతారనే ప్రచారం జరిగిన సందర్భంలో బీఆర్‌ఎస్ నేత, మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఆ ప్రచారాన్ని తీవ్రంగా ఖండించిన విషయం తెలిసిందే. తాజా పరిణామం పట్ల బీఆర్‌ఎస్ శ్రేణులు ఎలా స్పందిస్తాయనే విషయం ఆసక్తికరంగా మారింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్