Magazines

పంట రుణాలకు మారటోరియం

21 నిమిషాల క్రితం

Moratorium
avatar
balaji

ప్రచురించబడింది నవం 05, 2026 | 3 నిమిషాల చదవడం

కరువు మండలాల్లోని రైతులకు వర్తింపు

ఖరీఫ్‌‌లో రుణాలు రీ షెడ్యూల్‌ చేసిన వారికే అవకాశం
రబీ సీజన్‌‌కు కొత్త రుణాలు

ప్రభుత్వ ఆదేశాలతో 
జిల్లాల వారీగా బ్యాంకర్లతో సమావేశాలు

7న రాష్ట్రస్థాయిలో సమావేశం

పంట నష్టపోయిన వారికి రుణం మాఫీ చేయాలని కోరుతున్న రైతులు

మిగతా మండలాలకూ వర్తింపజేయాలని డిమాండ్‌‌

నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి

ఎల్‌‌నినో వర్షాభావ పరిస్థితులు సాగు రంగంపై, రైతులపై తీవ్ర ప్రభావం చూపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కార్యాచరణ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. 365 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించిన విషయం తెలిసిందే. పంట రుణాలకు మారటోరియానికి అవకాశం కల్పిస్తూ ఇటీవల జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. జిల్లాల వారీగా కరువు మండలాల్లో ఖరీఫ్‌‌లో తీసుకున్న పంట రుణాల వివరాల సేకరణతో పాటు బ్యాంకర్లతో సమావేశాలు జరపాలని కోరారు. దీంతో సమావేశాలు జరుగుతున్నాయి. ప్రకటించిన కరువు మండలాల్లోని రైతులు వారు తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించేందుకు 12 నెలల వరకు మారటోరియం ప్రకటిస్తారు. 2026 ఖరీఫ్‌ ‌సీజన్‌‌లో కొత్తగా రుణాలు తీసుకున్న, రీ షెడ్యూల్‌ ‌చేసిన రైతులకే వర్తించనుంది. దీనివల్ల రబీ సీజన్‌‌కు కొత్త రుణాలు తీసుకునే వెసులుబాటు కలగనుంది. రబీ సీజన్‌‌లో పంట సాగుపై అనిశ్చితి నెలకొన్న తరుణంలో కరువు మండలాల్లోనే కాకుండా అన్ని మండలాల్లో పంట రుణాలకు మారటోరియం అవకాశం కల్పించాలని రైతులు కోరుతున్నారు.


రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లాల్లోని 365 మండలాలను కరువు మండలాలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి న విషయం విదితమే. వీటిల్లో తీవ్ర కరువు మండలాలుగా 111 ప్రకటించగా, మధ్యస్థ కరువు ప్రాంతాలుగా 254 మండలాలను ప్రకటించింది. ఈ నేపథ్యంలో వీటిల్లో రైతులకు పంట రుణాల నుంచి స్వల్ప ఊరట కలిగించేందుకు పంట రుణాలకు మారటోరియం ప్రకటించింది. లీడ్‌ ‌బ్యాంక్‌ మేనేజర్‌‌ల ఆధ్వర్యంలో జిల్లాల్లోని ఆయా బ్యాంకుల రీజియన్‌ ‌మేనేజర్‌‌లతో, వ్యవసాయ, హార్టికల్చర్‌ తదితర శాఖల అధికారులతో కలెక్టర్‌ అధ్యక్షతన సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 7వ తేదీలోపు అన్ని జిల్లాల్లో సమావేశాలు పూర్తి చేసి ప్రతిపాదనలు స్వీకరించనున్నారు. వాటిల్లో వచ్చిన అంశాల ఆధారంగా స్టేట్‌‌లెవల్‌ ‌బ్యాంకర్స్ కమిటీ (ఎస్‌ఎల్‌‌బీసీ) గైడ్‌‌లైన్స్ రూపొందించనుంది. దీర్ఘకాలికంగా పెండింగ్‌‌లో ఉన్న పంట రుణాలు కాకుండా కేవలం 2026 ఖరీఫ్‌ ‌సీజన్‌‌లో పంట రుణాలు రీ షెడ్యూల్‌ ‌చేసుకున్న రైతులకే మారటోరియం అవకాశం ఇవ్వనున్నారు. ఇప్పుడు తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించేందుకు మధ్యస్థ కరువు మండలాల్లోని రైతులకు 36 నెలలు (3 సంవత్సరాలు), తీవ్ర కరువు ప్రకటించిన ప్రాంతాల్లో దాదాపు 60 నెలలు(5 సంవత్సరాల) గడువిచ్చే అవకాశం ఉంది.


కరువు పరిస్థితిని బట్టి మరింత పెంచే అవకాశమూ లేకపోలేదు. ​అన్ని మండలాల్లో అవకాశం కల్పించాలని కోరుతున్న రైతులు రాష్ట్రవ్యాప్తంగా ఎంతమంది రైతులు ఖరీఫ్‌‌లో తీసుకున్న రుణాలపై డేటా సేకరణ జరుగుతున్నది. ఈ నెల 7 వరకు పూర్తి లెక్కలు వస్తాయని అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కరువు బారిన పడిన రైతులపై ఉన్న పంట రుణాల బకాయిల విలువ సుమారు రూ.20 వేల కోట్లుగా ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్టు తెలిసింది. ఉదాహరణకు నిజామాబాద్‌ ‌జిల్లా వ్యాప్తంగా 1,86,763 లక్షల మంది రైతులు రూ.5467 కోట్ల మేర పంట రుణాలు పొందారు. అదే విధంగా కామారెడ్డి జిల్లాలో సుమారు 2.45 లక్షల మంది రైతులకు రూ.5200 కోట్ల వరకు రుణాలు అందజేశారు. ‌నాగర్‌ ‌కర్నూల్‌ జిల్లాలో 65,893 మంది రైతులు రూ.1125 కోట్లు రుణం తీసుకున్నారు. వ్యవసాయ టర్మ్‌ ‌రుణాలు 27,297 మంది తీసుకోగా వాటి విలువ రూ.653 కోట్లు. ఎక్కువగా ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, రంగారెడ్డి, మెదక్‌ ‌ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది.

ప్రస్తుతం కరువు మండలాల్లోని రైతులకే మారటోరియం ప్రకటించగా.. ఎల్‌‌నినో ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న నేపథ్యంలో అన్ని మండలాల్లోని రైతులకు సైతం అవకాశం కల్పించాలని డిమాండ్‌‌ వస్తోంది. రబీ సాగుపై అనిశ్చితి నెలకొనగా.. ఖరీఫ్‌‌లో పంటలు నష్టపోయి పలువురు రైతులు తీవ్ర అప్పుల ఊబిలో కూరుకుపోయారు. కామారెడ్డి జిల్లాలో కేవలం జుక్కల్‌, పెద్దకొడప్‌‌గల్‌, సదాశివనగర్‌, మహమ్మద్‌‌నగర్‌ మండలాల్లో మధ్యస్థ కరువు ఉన్నట్టు ప్రకటించారు. ‌కానీ ఇతర మండలాల్లో సుమారు 2000 ఎకరాల మేర వరి పంట ఎండిపోయింది. నిజామాబాద్‌ ‌జిల్లాలో మధ్యస్థ కరువు మండలాలుగా 18 ప్రకటించగా.. ప్రభావం ఇతర మండలాల్లో సైతం నెలకొంది. అందుకే అన్ని మండలాల్లో కరువు ఛాయలు నెలకొన్న నేపథ్యంలో అన్ని చోట్లా రైతులకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు.


​నష్టపోయిన రైతుల 
రుణమాలు మాఫీ చేయాలి : రమేశ్‌‌బాబు, సీపీఐ(ఎం) నిజామాబాద్‌ ‌జిల్లా కార్యదర్శి

వర్షాభావ పరిస్థితులు, సమయానికి కరెంట్‌ అందక, బోరుబావులు ఎత్తిపోయి పంటలు ఎండిపోయాయి. జిల్లా వ్యాప్తంగా సుమారు 4500 ఎకరాల్లో వరి ఎండిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయి అప్పుల ఊబిలో కూరుకుపోయారు. కావున నష్టపోయిన రైతుల పంట రుణాలు పూర్తిగా మాఫీ చేసి కొత్త రుణాలు ఇవ్వాలి. కరువు మండలాల్లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లోని రైతుల పంట రుణాలకు మారటోరియం సౌకర్యం కల్పించి, వడ్డీ రేట్లు తగ్గించాలి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్