నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని టీఎన్సీవోస్ సంఘం డిమాండ్ చేసింది. బుధవారం హైదరాబాద్ లో టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.ఎం. హుస్సేని ముజీబ్ నేతృత్వంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉద్యోగుల పీఆర్సీ, సీపీఎస్ రద్దు -ఓపీఎస్ పునరుద్ధరణ తదితర సమస్యలపై చర్చించి పలు తీర్మానాలను ఆమోదించారు. రెండు డీఏలను విడుదల చేసినందుకు ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మిగిలిన డీఏలను కూడా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హెచ్ఓడీల నుంచి సచివాలయానికి ఉద్యోగులను పంపించేందుకు 12.5 కోటాను అమలు చేయాలనీ, పెండింగ్ బిల్లులను యుద్ధ ప్రాతిపదికన క్లియర్ చేయాలని తదితర తీర్మానాలను ఆమోదించారు. ఏఐఎస్జీఈఎఫ్ ఆద్వర్యంలో డిసెంబర్ 12న కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా చలో ఢిల్లీ నిరసన ప్రదర్శనకు పెద్ద సంఖ్యలో రాష్ట్రం నుంచి వెళ్లాలని నిర్ణయించారు. అంతకు ముందు భారతదేశ మొదటి విద్యాశాఖ మంత్రి మౌలనా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సమావేశంలో అసోసియేట్ అధ్యక్షులు కస్తూరి వెంకటేశ్వర్, ముత్యాల సత్యనారాయణ గౌడ్, కోశాధికారి ఉమాదేవి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు, పాల్గొన్నారు.





కామెంట్‌లు (0)