Magazines

కేంద్రం రూ.50 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించాలి

59 నిమిషాల క్రితం

package
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 28, 2026 | 1 నిమిషాల చదవడం

రేషన్‌ షాపుల ద్వారా 14 రకాల నిత్యావసరాలు అందించాలి
పంటనష్ట పరిహారం రూ.50 వేలు చెల్లించాలి : రాష్ట్ర ప్రభుత్వానికి సీపీఐ (ఎం) విజ్ఞప్తి


నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఎల్‌‌నినో వల్ల రాష్ర్టంలో నెలకొన్న కరువును ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణ సాయంగా రూ.50 వేల కోట్ల ప్యాకేజీని ప్రకటించాలని సీపీఐ(ఎం) రాష్ర్ట కమిటీ డిమాండ్‌ ‌చేసింది. బుధవారం ఉప ముఖ్యమంత్రి భట్టి అధ్యక్షతన కరువు నివారణ చర్యలపై జరిగిన అఖిల పక్ష సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ర్ట కార్యదర్శి జాన్‌‌వెస్లీ, మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి పాల్గొని రాష్ర్ట ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు. ‘రాష్ర్టంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెల కొన్నాయి. కీలక ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు ప్రమాదకర స్థాయిలో పడిపోయాయి. భూగర్భ జలాలు వేగంగా ఇంకిపోతుండటంతో సాగు, తాగునీరు, విద్యుత్ ఉత్పత్తికి తీవ్ర విఘాతం కలుగుతోంది. బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు కిలో రూ.90 నుండి రూ.95 వరకు చేరుకున్నాయి. నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలను, రైతాంగాన్ని, వ్యవసాయ కూలీలను కాపాడుకునేందుకు చర్యలు చేపట్టాలి’ అని విజ్ఞప్తి చేయడంతో పాటు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్