Magazines

ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలి

59 నిమిషాల క్రితం

The public education sector must be strengthened.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 02, 2026 | 3 నిమిషాల చదవడం

​విద్యార్థులు ఉన్న చోట నూతన బడులు ఏర్పాటు చేయాలి : మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి

ఉపాధ్యాయులు సమాజానికి పాఠాలు నేర్పాలి : ప్రొఫెసర్‌ ‌కె.నాగేశ్వర్‌

​అట్టహాసంగా ప్రారంభమైన టీఎస్ యూటీఎఫ్‌ ఏడో జిల్లా మహాసభలు

​నవతెలంగాణ-కట్టంగూరు

ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలని, విద్యార్థులు ఉన్నచోట నూతన బడులను ఏర్పాటు చేయాలని ​మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. అధ్యయనం, అధ్యాపనం, సామాజిక స్పృహ అనే లక్ష్యాలతో పనిచేస్తున్న టీఎస్‌‌యూటీఎఫ్‌ జిల్లా ఏడవ మహాసభలు నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలకేంద్రంలో ఆదివారం బీఎన్ గౌడ్ ఫంక్షన్ హాల్ లో అట్టహాసంగా ప్రారంభమ య్యాయి. మండల కేంద్రంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఉపాధ్యాయులు భారీ సంఖ్యలో మహా ప్రదర్శనగా అమరజీవి సామల రమేష్, సట్టు శంబయ్య ప్రాంగణంలో నిర్వహించే మహాసభలకు చేరుకున్నారు. మహాసభల సందర్భంగా జాతీయ పతాక ఆవిష్కరణ సీనియర్ నాయకులు చిలుక సోమయ్య, అఖిల భారత టీచర్స్ ఫెడరేషన్ పతాకాన్ని ఎండి అబ్దుల్ ఖాదర్, టీఎస్ ‌యూటీఎఫ్‌ పతాకాన్ని సీనియర్ నాయకులు నర్రా సరళ ఆవిష్కరించారు. అనంతరం ఉపా ధ్యాయుల బోధనకు ఉపయోగపడే ‌టీఎల్ఎం ఎఫ్ ఎల్ఎన్‌ మేళాను ప్రారంభించారు. ఆహ్వాన సంఘం అధ్యక్షులు యర్కల సత్తయ్య ప్రారంభో పన్యాసం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ బడులను బలోపేతం చేయడానికి ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు సమిష్టిగా కృషి చేయాలన్నారు. బడుల బలోపేతం కేవలం ఉపాధ్యాయుల బాధ్యత కాదన్నారు. ప్రభుత్వరంగంలో విద్యావ్యవస్థ పటిష్టంగా ఉన్నప్పుడే పేదవారికి విద్య అందుతుందని పేర్కొన్నారు. విద్యార్థులలో హేతు వాద దృక్పథాన్ని పెంపొందించిన ప్పుడే సామాజిక విలువలు పెంపొందుతాయని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 12వేల పాఠశాలల్లో తరగతికి ఆరు నుంచి ఏడుగురు విద్యార్థులు మాత్రమే ఉన్నారని, వాటిలో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. టీఎస్ యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు చావా రవి మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యారంగంలో అనేక సమస్యలు ఉన్నాయ న్నారు. వర్క్ అడ్జ‌స్ట్‌‌మెంట్‌ విషయంలో జీవో25 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు మరణ శాసనంగా మారిందన్నారు. ప్రభుత్వం విద్యను ప్రయివేటీకరించే దిశగా అడుగులు వేస్తోందని తెలిపారు. విద్యార్థుల సంఖ్య తక్కువనే కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 3 వేల పాఠశాలలను మూసివేశారని చెప్పారు. ర్యాంకులను చూసి తల్లిదండ్రులు ప్రయివేట్‌ పాఠశాలకు పంపిస్తున్నారని, ప్రభుత్వ పాఠశాలలోనే అనుభవజ్ఞులైన ఉపాధ్యా యులు ఉన్నారని చెప్పారు. జిల్లా అదనపు కలెక్టర్ ‌నంద్యాల ప్రేమ్‌కరణ్ రెడ్డి ‌మాట్లాడుతూ ​ప్రభుత్వ పాఠశాలలోని ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చునని, ప్రభుత్వ బడులను బలోపేతం చేయడానికి ఎలాంటి చర్యలు చేపట్టా లనే అంశాన్ని ఉపాధ్యాయులు ప్రభుత్వం దృష్టికి తీసుకు రావాలని సూచించారు. పాఠశాలలో ఉపాధ్యాయుని ప్రభావం విద్యార్థులపై ఉంటుందని, ప్రతి విద్యార్థి పై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించి బోధన చేస్తే మెరుగైన ఫలితాలు వస్తాయన్నారు. ప్రభుత్వం యంగ్ ఇండియా స్కూల్స్‌‌ను గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటుచేస్తే పేద విద్యార్థు లకు నాణ్యమైన ఉచిత విద్య అందుతుందని తెలిపారు.

​ఉపాధ్యాయులు సమాజానికి పాఠాలు చెప్పేలా ఉండాలి : మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్‌ ‌కె.నాగేశ్వర్‌

‌ఉపాధ్యాయులు కేవలం విద్యార్థులకే కాకుండా సమాజానికి పాఠాలు చెప్పే విధంగా ఉండాల‌ని మాజీ శాసనమండలి సభ్యులు, ప్రొఫెసర్ కె.నాగేశ్వర్‌ అన్నారు. మహాసభల అనంతరం నిర్వహించిన చైతన్య సదస్సులో ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుడు తరగతి గదికి, సమాజానికి మధ్య వారధిగా ఉండాలని, పబ్లిక్ ఇంట లెక్చువల్ అంటే సమాజంపై అవగాహన ఉండి ఎదుటి వారిని ఒప్పించే విధంగా ఉండాలని చెప్పారు. దేశ జీడీపీ 1950-1970 మధ్యలో 3.4 శాతం ఉండగా ప్రస్తుతం అది 7.8 గా పెరిగిందని, కానీ అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాల వారికి అందకపోవడంతో, యువత అసంతృప్తితో జంతర్ మంతర్ ఉద్యమాలు చేస్తున్నారని తెలిపారు. వారి ఆందోళన వెనుక ఎలాంటి రాజకీయ పార్టీలు గానీ మీడియా గానీ, ప్రముఖ వ్యక్తులు గానీ లేరని పేర్కొన్నారు. మహాసభలలో ‘విద్యార్థులలో అభ్యసన సంక్షోభం కారణాలు పరిష్కారాలు’ అనే సదస్సులో నకిరేకల్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్‌, ప్రొఫెసర్‌ ‌బెల్లి యాదయ్య మాట్లాడుతూ నిజం వైపు నిలబడే ధైర్యమే విద్య అని అభ్యుదయ భావాలు కలిగిన ఉపాధ్యా యులు దాన్ని గుర్తుచేసుకుని వర్తమానాన్ని అద్భుతంగా తీర్చిదిద్దగలు గుతారని అన్నారు. మహాసభలకు సంఘం జిల్లా అధ్యక్షులు బక్కా శ్రీనివాసా చారి అధ్యక్షత వహించారు. మహాసభలో ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బొల్లి సత్యనారాయణ రావు, టాప్రా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలకుర్తి కృష్ణమూర్తి, టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ముదిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు పెరు మాళ్ళ వెంకటేశం, ఎన్ సోమయ్య, రాష్ట్ర పూర్వాధ్యక్షులు సి ఎస్ రాములు, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి, కట్టం గూర్ సర్పంచ్ శ్యామల శేఖర్, ఎఫ్ డబ్ల్యూ ఎస్ రాష్ట్ర కోశాధికారి ఎడ్ల సైదులు, జిల్లా ఉపాధ్యక్షులు బడుగు అరుణ, నర్రా శేఖర్ రెడ్డి, జిల్లా కోశాధికారి వీ రాజు, పూర్వ రాష్ట్ర కార్యదర్శి ఎన్ సరళ, ప్రధానో పాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షులు కొమ్ము శ్రీనివాస్, ఆహ్వాన సంఘం నాయకులు మిట్టపల్లి మురళయ్య, ఎం రాజశేఖర్ రెడ్డి, జె మాణిక్యం, విద్యాసాగర్ రెడ్డి, దేశపాక కృష్ణ, పోశం సైదులు, రాష్ట్ర కమిటీ సభ్యులు సిహెచ్ అరుణ, రాష్ట్ర సాంస్కృతిక కమిటీ కన్వీనర్ నల్ల నర్సింహ్మ, యాదాద్రి జిల్లా అధ్యక్షులు ఎం యాదయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి మెతుకు సైదులు, సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్, టాప్రా జిల్లా ప్రధాన కార్యదర్శి పందిరి శ్యాంసుందర్, పౌర స్పందన వేదిక జిల్లా అధ్యక్షులు పాల్వాయి అంజిరెడ్డి, తెలంగాణ సాహితి జిల్లా అధ్యక్షులు కుకుడాల గోవర్ధన్ పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్