మాజీమంత్రి జీవన్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఎల్‌నినో ప్రత్యేక పరిస్థితుల్లో కన్నెపల్లి పంపుహౌస్ నుంచి నీటిని ఎత్తిపోయాలని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి టి జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ నీరు ఎత్తిపోసేందుకు తగిన లెవల్ లేకపోతే కాఫర్ డ్యాం నిర్మించాలని కోరారు. నీరు, కరెంట్ అడగొద్దనీ, వరి విత్తనాలు కొనే రైతుల నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకుంటున్నారని అన్నారు. ఇలాంటి మూర్ఖపు ఆలోచనను రాష్ట్ర ప్రభుత్వం మానుకోవాలని డిమాండ్ చేశారు. వృధాగా పోతున్న ప్రాణహిత జలాలను ఉపయోగించుకునే వెసులుబాటు ఉందనీ, తాగు, సాగు నీటితోపాటు విద్యుత్‌కు కూడా ఉపయోగపడుతుందని అన్నారు. తుమ్మిడిహెట్టి విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. పాలన చాతకాకపోతే రేవంత్ రెడ్డి తప్పుకుని గవర్నర్‌కు భాద్యతలను అప్పగించాలని కోరారు.






కామెంట్లు (0)