Magazines

శంషాబాద్ లో ఏటీఎం ధ్వంసం

46 నిమిషాల క్రితం

ATM vandalized in Shamshabad
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 06, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్: శంషాబాద్  జీహెచ్ఎంసీ పరిధిలోని శాతంరాయి వద్దనున్న యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో సోమవారం రాత్రి భారీ చోరీ జరిగింది. అర్ధరాత్రి ఏటీఎంలోకి చొరబడిన గుర్తుతెలియని దుండగులు ఏటీఎం మిషన్‌ను ధ్వంసం చేసి అందులోని రూ.30 లక్షలకు పైగా నగదును దొంగలించారు. ఈ విషయం తెలుసుకున్న బ్యాంకు అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న శంషాబాద్ పోలీసులు, క్లూస్ టీమ్ ఆధారాలను సేకరిస్తున్నారు. సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా దుండగుల కోసం గాలింపుచర్యలు చేపట్టారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్