Magazines

త్వరలో ఆటోల్లోనూ కామన్‌పాస్ సేవలు

1 గంట క్రితం

Common Pass services to be available in autos soon
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 04, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : హైదరాబాద్‌లో మెట్రో, ఆర్టీసీ బస్సులకు అందుబాటులో ఉన్న కామన్ మొబిలిటీ పాస్‌ను త్వరలో ఆటోలకు కూడా విస్తరించాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. ఒకే కార్డుతో అన్ని ప్రజా రవాణా సేవలు అందించేలా వ్యవస్థను అభివృద్ధి చేస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. కామన్ పాస్‌ పనితీరును పరిశీలించేందుకు భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి మెట్రో, ఆర్టీసీ బస్సులో ప్రయాణించి ప్రయాణికుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ప్రస్తుతం ఉన్న రోజువారీ రూ.400, నెలవారీ రూ.8,500 పాస్‌ ధరలపై ప్రయాణికుల స్పందనను పరిశీలించి, అవసరమైతే ధరలను సమీక్షిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్