నవతెలంగాణ - హైదరాబాద్: తిరుపతి జిల్లా శ్రీసిటీలోని ఓ ప్రయివేటు పరిశ్రమలో శనివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో నలుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోవడంతో విషాదం నెలకొంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
వివరాల్లోకి వెళితే.. శ్రీసిటీలోని ఓ ప్రయివేటు ఫ్యాక్టరీలో ఉన్న వాటర్ బాయిలర్ శనివారం ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోయింది. ఈ పేలుడు ధాటికి ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ వారు కన్నుమూశారు.
శ్రీసిటీలో బాయిలర్ పేలి ఐదుగురు మృతి
13 గంటల క్రితం

Shiva Kumar
ప్రచురించబడింది అక్టో 03, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)