Magazines

ఇండిగో టికెట్‌ ధరలకు రెక్కలు

1 గంట క్రితం

IndiGo
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 06, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - న్యూఢిల్లీ: విమాన ఇంధన ధరల పెరుగుదల నేపథ్యంలో దేశీయ విమానయాన సంస్థ ఇండిగో టికెట్‌ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. దేశీయ సర్వీసుల్లో ప్రయాణ దూరాన్ని బట్టి రూ.375 నుంచి రూ.1,300 వరకు సర్‌చార్జీ విధించనుంది. 500 కిలోమీటర్ల వరకు ప్రయాణానికి రూ.375, 2,000 కిలోమీటర్లకు మించిన దూరానికి గరిష్ఠంగా రూ.1,300 వరకు అదనపు చార్జీ పడనుంది. ఈ పెంపుతో ప్రయాణికులపై ఏడాదికి రూ.2,000 కోట్ల నుంచి రూ.2,500 కోట్ల వరకు అదనపు భారం పడే అవకాశం ఉంది. అంతర్జాతీయ సర్వీసుల టికెట్‌ ధరలను కూడా పెంచనున్నట్లు ఇండిగో వెల్లడించింది. కాగా, ఏప్రిల్‌లో టికెట్‌ ధరలు పెంచిన ఆరు నెలలకే మరోసారి చార్జీలు పెంచడం గమనార్హం.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్