నవతెలంగాణ - హైదరాబాద్: సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాలంటూ ఈసీ కార్యాలయం వద్ద విపక్ష ఎంపీలు నిరసన తెలుపుతున్నారు. దీంతో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీని, కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈసందర్భంగా పలువురు కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు. బారికేడ్లు అడ్డంపెట్టి విపక్ష ఎంపీలను అడ్డుకోవడానికి ప్రయత్నించగా, రాహుల్‌గాంధీ బారీకేడ్లు ఎక్కి నిరసన తెలిపారు. నినాదాలు చేస్తున్న ఎంపీలను పోలీసులు అరెస్టు చేసి బస్సులో తరలిస్తున్నారు.





కామెంట్‌లు (0)