Magazines

రూ.5 కోట్ల లంచం ఆరోపణలు.. పోలీసు అధికారి అరెస్ట్‌

3 గంటల క్రితం

Police
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 12, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : తమిళనాడులోని తంజావూర్‌కు చెందిన శరవణన్‌ నిర్వహిస్తున్న ప్రైవేట్‌ ఆస్పత్రి విషయంలో వాటాదారులతో వివాదం తలెత్తింది. ఈ నేపథ్యంలో శరవణన్‌ సహా ముగ్గురిపై కేసు నమోదై, దర్యాప్తు సీబీసీఐడీకి బదిలీ అయింది. కేసు నుంచి బయటపడేందుకు పోలీసులు రూ.5 కోట్లు లంచం అడిగినట్లు శరవణన్‌ ఫిర్యాదు చేశారు. ఇందులో రూ.3.75 కోట్లు నగదు, రూ.1.70 కోట్లు చెక్కుల రూపంలో జిల్లా నేర విభాగ ఇన్‌స్పెక్టర్‌ సుకుమారన్‌కు ఇచ్చినట్లు ఆరోపించారు. దీంతో సీబీసీఐడీ పోలీసులు శనివారం సుకుమారన్‌ ఇంట్లో ఆరు గంటలపాటు సోదాలు నిర్వహించి, పత్రాలు, వీడియో ఆధారాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అనంతరం ఆయనను అరెస్ట్‌ చేశారు. ఛాతినొప్పితో బాధపడుతున్న సుకుమారన్‌ను తంజావూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్