నవతెలంగాణ - హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీలోని సోనియా విహార్లో మంగళవారం రాత్రి కాల్పులు కలకలం రేపాయి. హెల్మెట్లు ధరించి బైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు మనీశ్ యాదవ్ (34)పై కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి, ఫోరెన్సిక్ బృందాలతో ఆధారాలు సేకరించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
ఢిల్లీలో కాల్పులు.. వ్యక్తి మృతి
55 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 14, 2026 | 1 నిమిషాల చదవడం



కామెంట్లు (0)