నవతెలంగాణ - హైదరాబాద్ : జగిత్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కథలాపూర్ మండలం చింతకుంట గ్రామంలో వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి చెందారు. గుంటూరు జిల్లా వినుకొండకు చెందిన వీరు కొంతకాలంగా జగిత్యాల జిల్లాలో భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్నారు. బుధవారం తెల్లవారుజామున వ్యవసాయ బావి వద్దకు వెళ్లిన వారు ప్రమాదవశాత్తూ అందులో పడిపోయారు. గమనించిన స్థానికులు వారిని బయటకు తీయగా, అప్పటికే మృతి చెందారు. ఉపాధి కోసం వలస వచ్చిన యువకులు ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాదం నెలకొంది.
వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 14, 2026 | 1 నిమిషాల చదవడం




కామెంట్లు (0)