ఐక్యరాజ్యసమితిలో ప్రసంగానికి రాయబారుల వాకౌట్
ఆందోళనలతో అట్టుడికిన న్యూయార్క్.. పాల్గొన్న వేలాది మంది..
ఇజ్రాయిల్ ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు
నిరసనకారులపై పోలీసుల దాష్టీకం
గాజా యుద్ధంపై ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న వ్యతిరేకతకు ఐక్యరాజ్య సమితి వేదిక మరోసారి సాక్ష్యమైంది. ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ప్రసంగించేందుకు సిద్ధమవుతున్న వేళ పలుదేశాల రాయబారులు సభ నుంచి వాకౌట్ చేశారు. ఇటు న్యూయార్క్ వీధుల్లో వేలాది మంది నిరసనకారులు ఆందోళనకు దిగారు. నెత న్యాహూ చర్యలకు వ్యతి రేకంగా నిరసన, ప్రదర్శనలు జరిపారు. ‘మారణహోమం ఆపండి.. యుద్ధం వద్దు.. పాలస్తీనాకు స్వేచ్ఛ కావాలి.. నెతన్యాహూ నరకానికి పో.. ’ అంటూ ఆందోళనకారులు నినాదాలతో హోరెత్తించారు. దీంతో న్యూయార్క్ నగరం నిరసనలతో అట్టుడికింది. ఇటు ఆందోళనల్లో పాల్గొన్న పలువురు నటీనటులు, రాజకీయ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం ఉద్రిక్తతలకు దారితీసింది.
న్యూయార్క్: ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల సందర్భంగా ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెత న్యాహూకు తీవ్ర నిరసన ఎదురైంది. గురువారం ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ఆయన ప్రసంగించేందుకు సిద్ధమవుతున్న సమయంలో వివిధ దేశాలకు చెందిన రాయబారులు సభ నుంచి వాకౌట్ చేశారు. కొందరు నెత న్యాహూను హేళన చేస్తూ బయటకు వెళ్లారు. ఆయనకు మద్దతుగా ఉన్నవారు మాత్రం నిలబడి కరతాళధ్వనులు చేశారు. సభలో క్రమశిక్షణ పాటిం చాలని స్పీకర్ పలుమార్లు హెచ్చరించారు. రాయబారుల వాకౌట్‌పై నెతన్యాహూ తీవ్రం గా స్పందిం చారు. సభ నుంచి వెళ్లకుండా ఉన్నవారిని ఉద్దే శించి ‘ఈ హాలును విడిచివెళ్లని పిరికివారు ఎవరైనా ఉంటే ఇప్పుడే వెళ్లిపొండి’ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీపై కూడా ఆయన విమర్శలు చేశారు. మమ్దానీపై యూదు వ్యతిరేకత ఆరోపణలు చేస్తూ, ఆయన మేయర్‌గా ఎన్నికైన తర్వాత నగరంలో తమకు రక్షణ లేదని యూదులు భావిస్తున్నారని నెతన్యాహూ అన్నారు.
మిత్రదేశాలపైనా విమర్శలు
ఇజ్రాయిల్ భాగస్వాములైన బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు సైతం నెతన్యాహూపై విమర్శలకు పదును పెట్టడం విశేషం. దీంతో ఆ దేశాలు కూడా ఆయన ఆగ్రహానికి గురయ్యాయి. ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లోని తమ సెటిల్మెంట్లకు (స్థావరాలు) వ్యతిరేకంగా ఫ్రాన్స్, బ్రిటన్ చేసిన ప్రకటనలపై ఆయన స్పందిస్తూ 'వారు ఈ చిన్న ఇజ్రాయిల్‌పై వలసవాద ఆరోపణలు చేస్తున్నారు. దేవుని దయ వలన అసలు ఆ వలసవాద పదాన్ని సృష్టించింది వారే' అని ఎద్దేవా చేశారు. వెస్ట్‌బ్యాంక్‌లోని పాలస్తీనా సమాజాలను లక్ష్యంగా చేసుకుంటున్న ఇజ్రాయిల్ యువత గురించి మాట్లాడుతూ వారు కొద్దిమందేనని, అయినా అటువంటి చర్యలను సహించబోనని, చట్టాన్ని చేతు ల్లోకి తీసుకుంటే ఊరుకోనని చెప్పారు. హమాస్‌కు మద్దతు ఇస్తోం దంటూ టర్కీపై విమర్శలు చేసిన నెతన్యాహూ.. ఆ దేశ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్‌ను నిరంకుశుడిగా అభివర్ణించారు. ఇరాన్‌పై కూడా తీవ్ర ఆరోపణలు చేస్తూ, ఇజ్రా యిల్-అమెరికా సైనిక చర్యలు టెహ్రాన్ అణ్వాయుధాల తయారీని అడ్డుకు న్నాయని ఆరోపించారు. ఇరాన్ నాయ కత్వ పతనం ఎంతో దూరంలో లేదని ఆయన అన్నారు.
న్యూయార్క్‌లో భారీ నిరసన ప్రదర్శన
ఐక్యరాజ్యసమితి సమావేశాల ప్రాంగణం సమీపంలో వేలాది మంది నెతన్యాహూకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు. ‘మారణహోమాన్ని ఆపండి’, ‘ప్రజలకు బాంబులు కాదు.. నిధులు ఇవ్వండి’, ‘యుద్ధం వద్దు’, ‘పాలస్తీనాకు స్వేచ్ఛ’ వంటి నినాదాలతో బ్యానర్లు, టీ-షర్టులతో నిరసనకారులు ఆందోళన చేపట్టారు. పాలస్తీనాకు మద్దతుగా పనిచేస్తున్న ‘జ్యూయిష్ వాయిస్ ఫర్ పీస్’ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో హాలీవుడ్ నటి, ఆస్కార్ విజేత సుసాన్ సరండన్, ఎమ్మీ అవార్డు విజేత హన్నా ఐన్‌బైండర్, డెమొక్రటిక్ కాంగ్రెస్ అభ్యర్థి డారియాలిజా అవిలా షెవాలియన్, న్యూయార్క్ నగర కౌన్సిల్ సభ్యుడు ఒస్సే తదితరులు పాల్గొన్నారు. పోలీసులు నిరసనకారులను అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆదేశించినప్పటికీ పలువురు ఫుట్‌పాత్‌లపైనే కూర్చొని నెతన్యాహూకు వ్యతిరేకంగా నినాదాలు కొనసాగించారు. దీంతో పోలీసులు ఒక్కొక్కరిగా నిరసనకారులను గుంపు నుంచి బయటికి లాగి వారి చేతులను వెనక్కి కట్టేసి బస్సుల వద్దకు తీసుకొనిపోయారు. అయినప్పటికీ ఆందోళనకారులు ‘నెతన్యాహూ.. నరకానికి పో’ అంటూ నినాదాలు కొనసాగించారు.
‘మన పేరు మీద సమాజాన్ని నాశనం చేస్తున్నారు’
నెతన్యాహూ చర్యలపై మేధావులు వ్యతిరేక గళం వినిపిస్తున్నారు. 'గాజాలో జరుగుతున్నది ఏమిటి? మన పేరు మీద, మన డబ్బుతో ఓ సమాజం మొత్తాన్నీ నాశనం చేస్తున్నారు. దీనికి వ్యతి రేకంగా గళం విప్పడం మన బాధ్యత. తన అకృత్యాలను సమర్ధించుకోవడానికి ఐరాస వేదికను ఉపయోగించుకునే హక్కు నెతన్యాహూకు లేదు' అని ఓ యూనివర్సిటీ ప్రొఫెసర్ మొరాడియాన్ ధ్వజమెత్తారు.
వీసా నిరాకరణ.. అబ్బాస్ గైర్హాజరు
ట్రంప్ ప్రభుత్వం వీసా నిరాకరించ డంతో నెతన్యాహూ విమర్శకులలో ఒకరైన పాలస్తీనా అధ్యక్షుడు మహ మూద్ అబ్బాస్ సమావేశాలకు హాజరు కాలేకపోయారు. అయితే నెతన్యాహూ ప్రసంగానికి ముందు ప్రదర్శించిన ఓ వీడియో సందేశంలో ఆయన మాట్లా డుతూ 'మేము ఈ చట్టవిరుద్ధమైన చర్యలను తిరస్కరిస్తున్నాము. అలాగే వాటికి ఆధారమైన ఆరోపణలను, సమర్ధ నలు కూడా తిరస్కరిస్తున్నాం' అని అన్నారు.






కామెంట్‌లు (0)