ఇజ్రాయిల్ మారణహోమంలో
తమ వాళ్లనూ, చేయిని కోల్పోయి..
అందరు ఉన్న ఇంట్లో ఆ సంతోషమే వేరు. యుద్ధోన్మాదంతో తెగబడుతున్న ఇజ్రాయిల్ ఎంతోమంది ప్రాణాలను పొట్టన బెట్టుకుంటోంది. ఇప్పటి వరకూ 74 వేల మంది పాలస్తీయన్లు చనిపోయారు. ఎంతో మంది విగత జీవులుగా మారారు. చాలామంది కుటుంబాల్లోని చిన్నారులు అనాథలయ్యారు. ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి ఉదంతం మరింత విషాదంలోకి నెట్టింది. తల్లిదండ్రులు, సోదరీమణులు ఇజ్రాయిల్ మారణ కాండలో చనిపోయారు. నెతన్యాహు బలగాలు జరిపిన దాడిలో గాయపడి తన ఎడమ చేతిని కోల్పోయ్యాడు. వృద్ధాప్యంలో ఉన్న తన అమ్మమ్మతో కలిసి ఉంటున్న గుడారంలో నోట్‌బుక్‌లో చదువుకుంటున్నాడు. ఇలాంటి చిన్నారుల సంఖ్య భారీగానే ఉన్నదని పాలస్తీయన్లు చెప్పుకుంటూ కన్నీరుపెడుతున్నారు.
పాపం.. పసివాడు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 29, 2026 | 1 నిమిషాల చదవడం




కామెంట్‌లు (0)