Magazines

ఓటరు పౌరసత్వ తనిఖీలకు అమెరికా సుప్రీం ఓకే

1 గంట క్రితం

US Supreme Court
avatar
balaji

ప్రచురించబడింది సెప్టెం 27, 2026 | 1 నిమిషాల చదవడం

వాషింగ్టన్ : అమెరికా పౌరులు కాదని అనుమానించిన ఓటర్లను గుర్తించడానికి, పౌరసత్వ సమాచారం కోసం వివాదాస్పద ఫెడరల్ డేటాను వాడుకోవడానికి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంపై అమలులో ఉన్న ఆంక్షలను సుప్రీంకోర్టు ఎత్తివేసింది. డేటా విశ్వసనీయతను విమర్శకులు గతంలో ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈ డేటా కారణంగా అమెరికా పౌరులను ఓటర్ల జాబితా నుంచి తప్పుగా తొలగించే అవకాశం ఉన్నదని వారు హెచ్చరించారు. ఈ వ్యవస్థ చట్టవిరుద్ధమని, పౌరుల గోప్యతా హక్కులను ఉల్లంఘిస్తోందని ఓ ఫెడరల్ న్యాయమూర్తి జూన్‌లో తీర్పు చెప్పారు. అయితే ఈ తీర్పును సుప్రీంకోర్టులోని కన్సర్వేటివ్ మెజారిటీ తోసిపుచ్చింది. ఉదారవాద భావాలు కలిగిన ముగ్గురు న్యాయమూర్తులు మెజారిటీ నిర్ణయంతో విభేదించారు. అర్హులైన వారి ఓటు హక్కును పొరబాటున రద్దు చేసే ప్రమాదం ఉన్నదని కేతాంజి బ్రౌన్ జాక్సన్ అనే న్యాయమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్