నవతెలంగాణ-కుభీర్
మండలంలోని రంజిని గ్రామానికి చెందిన రాథోడ్ హరిలాల్ -విజయ దంపతుల కుమార్తె ఐన రాథోడ్ వైష్ణవి ఇటీవల వెలువడిన ఎంబిబిఎస్ స్థానంలో చోటు లభించడంతో శుక్రవారం వి బి జి రాంజీ మరియు గ్రామస్తులు యువతికి శాలువా పూలమాలతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మారుమూల మండలమైన కుబీర్ లోని రంజిని గ్రామానికి చెందిన రాథోడ్ వైష్ణవి వైద్యరంగంలో చోటు లభించడంతో గ్రామానికి ఎంతో ఆదర్శంగా ఉంటుందని అన్నారు.
దింతో మారుమూల గ్రామంలో వైద్య విద్యలో చోటు సాధించడంతో నేటి యువతకు ఆదర్శం గా ఉంటుందన్నారు. దింతో గ్రామమలో ఉన్న యువకులు యువతి లు పట్టుదలతో కృషి చేసి మరిన్ని ఉన్నత స్థానాలు సాధించాలని కోరారు. ఈ కార్యక్రమం లో టెక్నీకల్ అసిస్టెంట్ సంతోష్,దత్తు, మహేష్, సాగర,రోజా తో పాటు గ్రామస్తులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.







కామెంట్లు (0)