Magazines

గ్రామీణ పేదలకు వెంటనే ఉపాధి పనులు కల్పించాలి

03 సెప్టెంబర్, 2026

SATTUPALLY
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 03, 2026 | 2 నిమిషాల చదవడం

- తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్

నవతెలంగాణ-సత్తుపల్లి 

​గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు లేక, ప్రత్యామ్నాయ కూలీ పనులు లభించక పేద వ్యవసాయ కార్మిక కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సత్తుపల్లి డివిజన్ కార్యదర్శి జాజిరి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ​బుధవారం తాళ్లమడ గ్రామంలో ఆ సంఘ సభ్యుడు  అయినంపూడి సనందరావు అధ్యక్షతన వ్యవసాయ కార్మిక సంఘం జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. వర్షాల ప్రభావం, వ్యవసాయ పనుల లేమి కారణంగా అనేక గ్రామాల్లో కూలీలకు నిరంతర ఉపాధి లభించడం లేదని, దీంతో కుటుంబ పోషణ భారంగా మారిందని విచారం వ్యక్తం చేశారు. ​ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వం వెంటనే స్పందించి, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనులను విస్తృతంగా ప్రారంభించి ప్రతి పేద కుటుంబానికి పని కల్పించాలని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. 


​గ్రామాల్లో చెరువుల పూడికతీత, కాలువల అభివృద్ధి, చెక్‌డ్యామ్‌ల నిర్మాణం, గ్రామీణ రహదారుల పునరుద్ధరణ, భూసార పరిరక్షణ, మొక్కల పెంపకం వంటి ప్రజా ఉపయోగకర పనులను తక్షణమే చేపట్టాలని కోరారు. ​కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద 125 రోజుల పని కల్పిస్తామని ప్రకటించినందున తెలంగాణలోని అర్హులైన ప్రతి గ్రామీణ కుటుంబానికి పూర్తి స్థాయిలో ఉపాధి లభించేలా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామీణ పేదలకు పనులు,  కుటుంబాలకు ఆదాయం,  గ్రామాలకు అభివృద్ధి అనే లక్ష్యంతో ప్రభుత్వం తక్షణమే ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని శ్రీనివాస్ కోరారు. ​పని కోరిన ప్రతి గ్రామీణ పేద కుటుంబానికి వెంటనే ఉపాధి కల్పించాలని, ​సంవత్సరంలో పూర్తి స్థాయిలో ఉపాధి పనులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. కూలీలకు రోజువారీ వేతనాలను ఎలాంటి జాప్యం లేకుండా సకాలంలో చెల్లించాలన్నారు. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న ఉపాధి హామీ వేతనాలను వెంటనే విడుదల చేయాలని, పని ప్రదేశాల్లో తాగునీరు, నీడ, ప్రథమ చికిత్స వంటి కనీస వసతులు కల్పించాలన్నారు. 


​వలసలను నివారించడానికి గ్రామీణ ప్రాంతాల్లోనే స్థానికంగా పని అవకాశాలు పెంచాలని కోరారు. ​ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం సత్తుపల్లి మండల కార్యదర్శి కువ్వారపు లక్ష్మణరావు, నాయకులు సాధు పున్నమయ్య, కొలికపోగు జగపతిరావు, మంచాల లక్ష్మి, సాధు సుజాత, దర్శనం సీత, బంకా రజిని, బాయమ్మ, ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్